ఆ రీమేక్ లో నటించాలనుంది
ప్రియమణి తన అందం, నటనతో ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.;
ప్రియమణి తన అందం, నటనతో ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నామధ్య ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మూవీలో నటించి ఆ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న ప్రియమణి తాజాగా గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్ కు మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది.
కాగా రీసెంట్ గా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన మనీ హీస్ట్ తమిళ రీమేక్ లో నటించాలనుందని, అందులో తన డ్రీమ్ రోల్ ను కూడా వెల్లడించారు. మనీ హీస్ట్ కు తమిళ వెర్షన్ చేయడానికి తానెంతో ఆసక్తికరంగా ఉన్నాని, ఆల్రెడీ తాను జవాన్ సినిమాలో చేసిన పాత్రను ఆడియన్స్ మనీ హీస్ట్ కు రీమేక్ లానే ఉంటుందని అంటారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
మనీ హీస్ట్ లోని టోక్యో లేదా రాక్వెల్ రోల్స్ చేయడాన్ని తానెంతో ఇష్టపడతానని ప్రియమణి చెప్పారు. కానీ ఆడియన్స్ చెప్తున్న జవాన్ లోని తన క్యారెక్టర్ ను బట్టి చూస్తే తనకు నైరోబీ పాత్ర సరిగ్గా సరిపోతుందని ఆమె అన్నారు. అయితే ప్రియమణి మాత్రం తనకు నిజంగా టోక్యో క్యారెక్టర్ చేయాలనుందని ఆ పాత్రపై తన ఇంట్రెస్ట్ ను బయటపెట్టారు.
కాగా ప్రియమణి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 తో పాటూ దళపతి విజయ్ చేస్తున్న జన నాయగన్ లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. విజయ్ తో చేస్తున్న జన నాయగన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియమణి, ఈ సినిమా తన కెరీర్లోనే స్పెషల్ ఫిల్మ్ అని రీసెంట్ గా గుడ్ వైఫ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడించారు.