పిక్‌టాక్ : చీర కట్టులో వింక్‌బ్యూటీ అందం చూశారా?
మలయాళ సినిమా 'ఒరు అదార్ లవ్'తో ఒక్కసారిగా స్టార్‌డం దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్.;
మలయాళ సినిమా 'ఒరు అదార్ లవ్'తో ఒక్కసారిగా స్టార్‌డం దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మోస్ట్ పాపులర్ కావడానికి ప్రధాన కారణం ఒరు అదార్ లవ్ లోని పాటలో ముద్దుగన్ పేల్చడం, కన్ను గీటడం అనే విషయం తెల్సిందే. ఓవర్ నైట్‌లో సోషల్ మీడియా సెన్షేషన్ అయిన ఈ వింక్ బ్యూటీ సినిమాల్లో వరుసగా నటించింది. మొదటి సినిమా ఒరు అదార్ లవ్ ఫ్లాప్ కాగా, ఆ తర్వాత సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ఒకటి రెండు సినిమాలు కాస్త పర్వాలేదు అన్నట్లుగా నిలిచినా ఓవరాల్‌గా హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్ వారియర్‌కి కచ్చితంగా తీవ్రంగా నిరాశను మిగిల్చాయి అనడంలో సందేహం లేదు. ఆమె నటిగా మరిన్ని సినిమాలు చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
స్కిన్ షో ఫోటోలతో వైరల్
ఓవర్ నైట్ స్టార్‌డం దక్కడంతో సోషల్ మీడియాలో మిలియన్‌ల కొద్ది ఫాలోవర్స్‌ను దక్కించుకున్నారు. దాదాపుగా 77 లక్షల మందిని ఫాలోవర్స్‌గా కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా స్కిన్ షో ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచే ఈ అమ్మడు అప్పుడప్పుడు చీర కట్టు ఫోటోల వల్ల వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనే విషయం తెల్సిందే. తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా చీర కట్టు ఫోటోల్లో ఈ అమ్మడి అందంకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ స్థాయి అందంగా ఉన్న ప్రియా ప్రకాష్ వారియర్‌కి అదృష్టం కలిసి రావడం లేదని, అందుకే ఆఫర్లు పెద్దగా రావడం లేదని కొందరు అంటున్నారు.
ప్రియా ప్రకాష్ వారియర్ చీర కట్టు ఫోటోలు
చేసిన చిన్నా చితకా సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. అందుకే ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ఈఅమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి అందమైన చీర కట్టు ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈసారి చీర కట్టులో కాస్త ఓల్డ్ గెటప్‌లో, ఏజ్ ఎక్కువ ఉన్న సాదారణ గృహిణి మాదిరిగా ప్రియా ప్రకాష్ ఫోటోలు ఉన్నాయి. అందమైన ప్రియా ప్రకాష్ వారియర్ ఇలా కూడా చాలా అందంగా ఉందని కొందరు అంటున్నారు. నడుము అందం చూపిస్తూ ప్రియా ప్రకాష్ వారియర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నితిన్ చెక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
2019 నుంచి కెరీర్ ను ఆరంభించిన ప్రియా ప్రకాష్ వారియర్ మొదట నరేష్ అయ్యర్‌తో కలిసి ఫైనల్స్ చిత్రం కోసం నీ మజవిల్లు పోలేన్ అనే పాట పాడింది. ఆ పాట పెద్దగా ఈమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఇక అర్బాజ్ ఖాన్ తో కలిసి హిందీ చిత్రం శ్రీదేవి బంగ్లా సినిమాలోనూ నటించింది. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. ఇప్పటికీ ఆ సినిమా లీగల్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. 2021 లో తెలుగు సినిమా చెక్ తో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో ప్రియా ప్రకాష్ వారియర్‌కి తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు తెలుగు సినిమాలు, కన్నడ, ఇతర భాషల్లో సినిమాలు చేసింది. కానీ ఏవీ కూడా ఈమెకు హిట్ తెచ్చి పెట్టలేదు.