అలా చేస్తే నాలోని కాళీ బయటికొస్తుంది!
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా 90వ దశకంలో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే.;
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా 90వ దశకంలో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. దిల్ సే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రీతి జింటా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ప్రీతి పలు సినిమాల్లో నటించింది. వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ప్రీతి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలుసు.
2016లో అమెరికన్ బిజినెస్ మ్యాన్ జీన్ గుడ్ఎనఫ్ ను పెళ్లి చేసుకున్న ప్రీతి ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ టీమ్ కు సహ యజమానిగా వ్యవహరిస్తున్న ప్రీతి రీసెంట్ గా మ్యాచులకు బ్రేక్ రావడంతో ఆ టైమ్ ను పిల్లలతో ఎంజాయ్ చేస్తూ తన ఫాలోవర్లతో చిట్ చాట్ ను నిర్వహించింది.
అందులో భాగంగా ప్రీతిని ఓ అభిమాని మీ గురించి జనాలకు తెలియని ఓ విషయాన్ని చెప్పమని ప్రశ్నించగా, దానికి ప్రీతి ఆన్సర్ ఇచ్చింది. బాత్‌రూమ్‌లో, గుడిలో, సెక్యూరిటీ చెకింగ్ టైమ్ లో ఫోటోలు తీస్తే తనకు అసలు ఇష్టముండదని, ఆ టైమ్స్ లో కాకుండా మిగిలిన టైమ్ లో ఫోటోలు తీసినా, అడిగినా తనకెలాంటి ప్రాబ్లమ్ ఉండదని చెప్పింది.
అంతేకాదు, ఆ టైమ్ లో తన పిల్లల ఫోటోలు తీస్తే తనలోని కాళీ బయటకొచ్చేస్తుందని చెప్పిన ప్రీతి, తాను చాలా సరదా మనిషినని, తన పర్మిషన్ లేకుండా ఫోటోలు, వీడియోలు తీస్తే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని, ఏదైనా తనను డైరెక్ట్ గా అడిగి చేయమని చెప్తున్న ప్రీతి, దయచేసి తన పిల్లల్ని మాత్రం వదిలేయాలని కోరింది.