• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రశాంత్ నీల్ అండతో...

ప్రశాంత్ నీల్ అండతో "బఘీరా".. రిలీజ్ ఎప్పుడంటే

| కన్నడలో రోరింగ్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శ్రీమురళి తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు.

By - Tupaki Desk
Update: 2024-10-15 09:30 GMT

కన్నడలో రోరింగ్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శ్రీమురళి తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన "బఘీరా" అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. ఈ సినిమాకి కథ అందించింది మరెవరో కాదు.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన రచనతో రూపొందిన "ఉగ్రం," "KGF," మరియు "సలార్" అద్భుత విజయాలు సాధించాయి.


ఇక ఇప్పుడు బఘీరా కూడా అంతే గ్రాండ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు, కేజీఎఫ్ కాంతార మరియు సలార్ వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాణం ద్వారా ఇప్పటికే ఈ సంస్థకు మంచి గుర్తింపు దక్కింది. ఇక బఘీరాలో శ్రీమురళి పవర్‌ఫుల్ రోల్‌ పోషించగా, రుక్మిణి వసంత, ప్రకాశ్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఏ.జే. శెట్టి సినిమాటోగ్రఫీ అందించగా, సంగీతాన్ని బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించగా, రవి సంతేహక్లూ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అన్నీ కలిసి ఈ చిత్రాన్ని కన్నడ చిత్రసీమలో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిపేలా ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ను తెలుగులో విడుదల చేయడానికి ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ముందుకొచ్చింది. గతంలో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగులో విజయవంతంగా పంపిణీ చేసిన ఈ సంస్థ, "బఘీరా" సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందజేయనుంది. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందుగా తెలుగు ప్రొమోషన్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

శ్రీమురళి ఈ చిత్రంలో చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారని పోస్టర్లు సూచిస్తున్నాయి. అభిమానుల ఉత్సాహాన్ని పెంచేందుకు అక్టోబర్ 17 ఉదయం 10:35 గంటలకు చిత్రంలోని "రుధిర హార" అనే మొదటి సింగిల్ పాట విడుదల కానుంది. ఈ పాట విడుదలతో చిత్రంపై మరింత హైప్ పెరగనుంది. ఇటీవల హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సినిమాలు భారీ విజయాలు సాధించడంతో, "బఘీరా" కూడా అదే జాబితాలో చేరుతుందని ఆశిస్తున్నారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక పరంగా గొప్ప కనిపించే "బఘీరా," ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంది.

Tags:    
  • Prashanthneel 
  • Srimurali 
  • Rukhminivasanth 
  • Prakashraj 
  • Bagheera 
  • Sandalwood 
  • Filmindustry 
  • Srimuralimovies 
  • Ajaneeshloknath 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS