ప్రదీప్ మళ్లీ అదే స్ట్రాటజీనా..?
స్మాల్ స్క్రీన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బుల్లితెర మీద తన టాలెంట్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చాడు.;
స్మాల్ స్క్రీన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బుల్లితెర మీద తన టాలెంట్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చాడు. షో ఎలాంటిదైనా సరే ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు అంటే అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క. స్మాల్ స్క్రీన్ పై రకరకాల షోస్ తో అలరిస్తున్న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు. మున్నా డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా సాంగ్స్ పరంగా కూడా మంచి బజ్ ఏర్పరచుకుంది. ఐతే ప్రదీప్ మాచిరాజు ఆ సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేస్తాడని అనుకోగా మళ్లీ గ్యాప్ ఇచ్చి స్మాల్ స్క్రీన్ పై బిజీ అయ్యాడు.
బుల్లితెర మీద పెద్దగా కనిపించట్లేదు..
ఇక రెండో సినిమా ప్రయత్నాలు మొదలవుతున్న టైం లో మళ్లీ షోస్ అన్నీ ఆపేసి సినిమా కోసం రెడీ అయ్యాడు. తన రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా వచ్చింది. ఐతే సినిమా ఆశించిన రేంజ్ లో అయితే వర్క్ అవుట్ కాలేదు. ప్రదీప్ ఈ సినిమా తర్వాత అయినా సినిమాలు కొనసాగిస్తాడేమో అనుకున్నారు కానీ అది జరగలేదు. ఈమధ్య బుల్లితెర మీద పెద్దగా కనిపించని ప్రదీప్ మళ్లీ దసరా ఫెస్టివల్ టైం లో ఒక షోకి హోస్ట్ గా కనిపించాడు.
మొత్తానికి ప్రదీప్ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు కానీ ఒక సినిమా చేయడం ఆ తర్వాత మళ్లీ తన షోస్ చేసుకుంటూ వెళ్లడం.. నెక్స్ట్ మరో సినిమా చేయడం మళ్లీ గ్యాప్ తీసుకోవడం ఇలా ఒక ప్లానింగ్ తో వెళ్తున్నాడు ప్రదీప్. ఐతే కంప్లీట్ గా షోస్ మానేసి హీరోగా చేయాలంటే కష్టమే. అలా అని కేవలం షోస్ చేస్తూ వెళ్తే సరిపోదు. అందుకే ప్రదీప్ అక్కడ ఇక్కడ రెండు బ్యాలెన్స్ చేస్తున్నాడు.
థర్డ్ సినిమా డిస్కషన్స్..
యాంకర్ గా చేసే ప్రతి ఒక్కరు కూడా తాను కూడా హీరో అవ్వాలనే అనుకుంటాడు. ఐతే ప్రదీప్ విషయంలో అది కాస్త లేట్ గా స్మాల్ స్క్రీన్ పై మంచి క్రేజ్ వచ్చాక జరిగింది. ఇప్పటికీ ప్రదీప్ తన థర్డ్ సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తున్నా.. ఆడియన్స్ తో టచ్ తప్పితే బాగోదని మళ్లీ షోస్ చేయడం షుఊ చేశాడు.
మరి ప్రదీప్ స్ట్రాటజీ ఏంటో తెలియట్లేదు కానీ ప్రదీప్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రదీప్ స్మాల్ స్క్రీన్ పై స్టార్ ఇమేజ్ తెచ్చుకోగా సినిమాల్లో కూడా తనకంటూ ఒక స్పెషాలిటీ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. ప్రదీప్ థర్డ్ సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.