• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ దూకుడు.. మరి RRR...

ప్రభాస్ దూకుడు.. మరి RRR హీరోల పరిస్థితేంటి?

| టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. రీసెంట్ గా కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-07-12 10:34 GMT

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. రీసెంట్ గా కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అలరించారు. నేషనల్ వైడ్ గా తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. పాన్ ఇండియా స్టార్ గా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తన ఇమేజ్ ను అలానే కంటిన్యూ చేస్తున్నారు. భారీ చిత్రాలను లైన్ లో పెడుతూ అదరగొడుతున్నారు. ఆడియన్స్ అంచనాలను తాకుతూ రానిస్తున్నారు. అయితే బాహబలి-2 అయ్యాక చిన్న గ్యాప్ తీసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత నుంచి వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ తో కంటిన్యూగా టచ్ లో ఉంటున్నారు.

అయితే కల్కి మూవీ అయిన వెంటనే.. రాజాసాబ్ సెట్స్ లో అడుగుపెట్టేశారు ప్రభాస్. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతోపాటు సలార్-2, స్పిరిట్ మూవీ షూటింగ్స్ మరికొద్ది రోజుల్లో మొదలు కానున్నాయి. హను రాఘవపూడి సినిమా కూడా లైనప్ లో ఉంది. అంటే మరో రెండేళ్లు వరుస సినిమాలతో రానున్నారు ప్రభాస్. ఇప్పుడు ఆయన స్పీడును టాలీవుడ్ కొందరు హీరోలు అందులేకపోతున్నారని అంటున్నారు నెటిజన్లు.

ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా స్పీడ్ ను అందుకోమని స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. త్వరగా షూటింగ్స్ పూర్తి చేసి కొత్తవి స్టార్ట్ చేయండని చెబుతున్నారు. అయితే పాన్ ఇండియా స్పీడ్ ను కంటిన్యూ చేయాలంటే.. సినిమాల మధ్య గ్యాప్ తక్కువ ఉండాలి. కానీ తారక్, చరణ్ స్క్రీన్ పై కనిపించి చాలా నెలలు అవుతోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత వీరిద్దరూ సోలోగా నటించిన మూవీస్ ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎన్టీఆర్.. దేవర మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయనున్నారు తారక్. కానీ ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. మరోవైపు, చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ షూటింగ్ ను ఇటీవల పూర్తి చేసుకున్నారు.

త్వరలో బుచ్చిబాబు మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. సుకుమార్ ప్రాజెక్ట్ ను కూడా రీసెంట్ గా లైన్ లో పెట్టారు. అయితే ప్రభాస్ తో పోలిస్తే.. తారక్, చరణ్ లైనప్ లో తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ వేరే లెవెల్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. మరి ఆయన స్పీడ్ ను తారక్, చరణ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • Prabhas 
  • Kalki2898ad 
  • Salaar 
  • Spiritmovie 
  • Ramcharan 
  • Gamecharan 
  • RC16 
  • Tollywood 
  • NTR 
  • Devaramovie 
  • NTR31 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS