• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్.. అక్కడ స్పెస్...

ప్రభాస్.. అక్కడ స్పెస్ లేదు!

| మొదటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కి2898ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-05-01 04:04 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాల ఉన్నాయి. ఇండియాలో ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్న డార్లింగ్ కు అసలు స్పెస్ దొరకడం లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలను స్టార్ట్ చేసేలా అడుగులు వేస్తున్నాడు. రాబోయే కాలంలో ప్రభాస్ మరింత బిజీగా కనిపించబోతున్నాడు. అతని షెడ్యూల్స్ లో అసలు స్పెస్ దొరికేలా లేదు.

మొదటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కి2898ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే మారుతి దర్శకత్వంలో చేస్తోన్న రాజాసాబ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఉండబోతోంది. సలార్ పార్ట్ 2 మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది.

శౌర్యంగపర్వం టైటిల్ తో ఈ సీక్వెల్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ పార్ట్ 2 మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో పాటు ఈ ఏడాదిలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాని ప్రభాస్ స్టార్ట్ చేస్తాడనే మాట వినిపిస్తోంది. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతోందనే ప్రచారం నడుస్తోంది.

నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయాల్సిన స్పిరిట్ మూవీ కూడా ఈ ఏడాది ఆఖరులో సెట్స్ పైకి వెళ్తుందని టాక్. ప్రస్తుతం సందీప్ రెడ్డి మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇలా ప్రభాస్ గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమా షూటింగ్స్ పెట్టుకున్నారు. రాజాసాబ్ షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతోంది. కల్కి 2898ఏడీ మూవీ ప్రమోషన్స్ లో మే, జూన్ రెండు నెలలు ప్రభాస్ అగ్రెసివ్ గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది.

జూన్ లో సలార్ 2 మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కల్కి ప్రమోషన్స్ చూసుకుంటూనే డార్లింగ్ సలార్ 2 కోసం డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. అలాగే జులై లేదా ఆగష్టులో హను రాఘవపూడి దర్శకత్వంలో చేయాల్సిన మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోందంట. అప్పటికి కల్కి మూవీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి కొంత ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది.

నవంబర్ లేదా డిసెంబర్ లో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. కల్కి2898ఏడీ పార్ట్ 2 మూవీ షూటింగ్ కూడా నాగ్ అశ్విన్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంట. ఇలా ఒక్క నెల కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రభాస్ కమిట్ అయిన సినిమాల కోసం చాలా బిజీ షూటింగ్ షెడ్యూల్స్ పెట్టుకున్నారని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు.

Tags:    
  • Prabhas 
  • Rajasaab 
  • Maruti 
  • Salaar2 
  • Kalki2898ad 
  • Nagashwin 
  • Spirit 
  • Sandeepreddyvanga 
  • Panindiaprojects 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS