ప్ర‌భాస్ కొత్త లుక్స్.. దేనికోసం?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజా సాబ్ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే మ‌రోవైపు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫౌజీ అనే సినిమాలో న‌టిస్తున్నారు.;

Update: 2025-11-17 11:29 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజా సాబ్ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే మ‌రోవైపు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫౌజీ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల‌తో పాటూ ప్ర‌భాస్ లైన‌ప్ లో ప‌లు సినిమాలున్నాయి. వాటిలో స్పిరిట్, క‌ల్కి2, స‌లార్2 సినిమాలుండ‌గా వీటిలో ముందు రిలీజ్ కానున్న సినిమా రాజా సాబ్.

రాజా సాబ్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా

అయితే ముందు రాజా సాబ్ సినిమాను మొద‌లుపెట్టిన‌ప్పుడు ఫ్యాన్స్ అంతా మారుతితో సినిమా ఎందుకని నానా గొడ‌వ చేస్తూ, ఈ సినిమాను ఆపేయ‌మ‌ని సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ కూడా చేశారు. కానీ మారుతి మాత్రం ఈ విష‌యంలో ఏం మాట్లాడ‌కుండా టైమ్ వ‌చ్చిన‌ప్పుడు త‌న వ‌ర్క్ తోనే స‌మాధానం చెప్తా అని మౌనం వ‌హించారు. అయితే ఎప్పుడైతే రాజా సాబ్ నుంచి ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్ వ‌చ్చాయో అందులో ప్ర‌భాస్ లుక్స్ చూసి అభిమానులే కాకుండా అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

రాజా సాబ్ లో వింటేజ్ లుక్స్ లో డార్లింగ్

రాజా సాబ్ లో ప్ర‌భాస్ ను మారుతి వింటేజ్ లుక్స్ లో ప్రెజెంట్ చేశారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్, మార్కెట్ విప‌రీతంగా పెరిగినా ప్ర‌భాస్ లుక్స్ విష‌యంలో మాత్రం చాలా తేడాలొచ్చాయి. అందుకే ప్ర‌భాస్ ను మ‌ళ్లీ పాత లుక్స్ లో చూడాల‌ని అంద‌రూ కోరుకున్నారు. గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ బ‌య‌ట కూడా చాలా సింపుల్ గా క‌నిపిస్తూ, త‌న హెయిర్ స్టైల్ ను ఓ క్లాత్ తో క‌వ‌ర్ చేసుకుంటూ కనిపిస్తూ వ‌స్తున్నారు.

అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకొచ్చిందంటే రీసెంట్ గా ప్ర‌భాస్ ఓ పార్టీకి అటెండ్ అయ్యారు. ఆ పార్టీలో ప్ర‌భాస్ కొత్త లుక్స్ అంద‌రినీ తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాత‌లు ప్రియాంక ద‌త్, స్వప్న ద‌త్ అరేంజ్ చేసిన ఓ ప్రైవేట్ పార్టీలో ప్ర‌భాస్ పాల్గొన‌గా, ఆ ఈవెంట్ నుంచి బ‌య‌టికొచ్చిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఎప్పుడూ త‌ల‌కు ఓ క్లాత్ ధ‌రించి క‌నిపించే ప్ర‌భాస్ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఇలా క‌నిపించ‌డంతో డార్లింగ్ లుక్స్ సంథింగ్ స్పెష‌ల్ గా మారాయి. ఈ ప్రైవేట్ పార్టీలో ప్ర‌భాస్ తో పాటూ యాక్ట‌ర్ సుబ్బ‌రాజు, ఏపీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు, సెల‌బ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వ‌ర్మ త‌దితరులు పాల్గొన‌గా, వాటికి సంబంధించిన ఆన్ లైన్ లో స‌ర్క్యులేట్ అవుతున్నాయి. కాగా ప్ర‌భాస్ ఈ కొత్త లుక్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంది ఫౌజీ కోస‌మా లేక స్పిరిట్ కోస‌మా అని ఫ్యాన్స్ ఇప్పుడు డిస్క‌ష‌న్స్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News