నెక్స్ట్ ఇయర్.. ప్రభాస్ రెండా? మూడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-31 07:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన లైనప్ లోకి అనేక సినిమాలను చేర్చుకున్న ఆయన.. ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ 2025లో సోలో హీరోగా ఒక్క సినిమాతో కూడా థియేటర్స్ లోకి రాలేదు. కేవలం కన్నప్ప మూవీలో క్యామియో రోల్ తో మెప్పించారు.

ఇప్పుడు 2026లో మాత్రం కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా ది రాజా సాబ్ మూవీతో సంక్రాంతికి సందడి చేయనున్నారు ప్రభాస్. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వనుంది.

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో ప్రభాస్ కాంపౌండ్ నుంచి మరొక మూవీ 2026లో కచ్చితంగా రిలీజ్ అవుతుంది. కుదిరితే రెండు చిత్రాలు కూడా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. అవే ఫౌజీ, స్పిరిట్ ప్రాజెక్టులు.

ముందుగా ఫౌజీ మూవీ విషయానికొస్తే.. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా చిత్రీకరణ నాన్ స్టాప్ గా కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. మరికొన్ని రోజుల్లో మేకర్స్ గుమ్మడికాయ కొట్టనున్నట్లు, సినిమా ఆగస్టులో రిలీజ్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పోలీస్ డ్రామా స్పిరిట్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. రీసెంట్ గా ప్రభాస్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. అయితే సందీప్ స్పీడ్ గా షూటింగ్స్ ను కంప్లీట్ చేస్తుంటారు. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో స్పిరిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

అయితే సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయినా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముఖ్యం. కాబట్టి అందులో జాప్యమైతే ఫౌజీ మూవీ.. ఆగస్టులో కాకపోయినా అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల అవుతుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలా జరిగితే స్పిరిట్ మూవీ.. డిసెంబర్ లో రిలీజ్ అవ్వడం కష్టం. కచ్చితంగా ప్రీ పోన్, లేదా పోస్ట్ పోన్ అవుతుంది.

ఏదేమైనా ప్రభాస్ నటించిన సినిమాల్లో రెండు కచ్చితంగా వచ్చే ఏడాది రానున్నాయి. మూడో చిత్రం మాత్రం డౌట్. అది కూడా రిలీజ్ అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే. అంతకన్నా మంచి మూమెంట్ మరొకటి ఉండదు. మరి వచ్చే ఏడాది.. ప్రభాస్ రెండు సినిమాలతో సందడి చేయనున్నారో.. లేక మూడింటితోనా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News