డార్లింగ్ లుక్ ను లాక్ చేసిన సందీప్

ఆల్రెడీ రాజా సాబ్ షూటింగ్ ను పూర్తి చేసిన డార్లింగ్ ప్ర‌స్తుతం ఫౌజీ సినిమాను మాత్ర‌మే చేస్తున్నారు.;

Update: 2025-11-19 10:02 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ది రాజా సాబ్ ను రిలీజ్ కు రెడీ చేస్తూనే, మ‌రోవైపు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫౌజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇంకోవైపు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప‌నుల్లో ఉన్నారు.

స్పిరిట్ కోసం ఎదురుచూపులు

ఆల్రెడీ రాజా సాబ్ షూటింగ్ ను పూర్తి చేసిన డార్లింగ్ ప్ర‌స్తుతం ఫౌజీ సినిమాను మాత్ర‌మే చేస్తున్నారు. దాంతో పాటూ స్పిరిట్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లి రెండింటినీ చేయాల‌ని డార్లింగ్ అనుకుంటున్నార‌ట‌. అందులో భాగంగానే స్పిరిట్ కు సంబంధించిన ప‌నుల్ని వేగ‌వంతం చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయినా ఇప్ప‌టివ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డంతో ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని అంద‌రూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లో డార్లింగ్

అయితే తాజాగా స్పిరిట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. స్పిరిట్ మూవీలో లుక్ కోసం ప్ర‌భాస్ కొన్ని రోజుల కింద‌టే టెస్ట్ షూట్ ను పూర్తి చేశార‌ని, లుక్ టెస్ట్ చేసిన చిత్ర యూనిట్ మూడు ప‌వ‌ర్‌ఫుల్ హై ఓల్టేజ్ లుక్స్ ను ఫైన‌ల్ చేసింద‌ని అంటున్నారు. స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే సందీప్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్ప‌గా, ఇప్పుడా పోలీస్ పాత్ర‌కు లుక్ ను ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది.

న‌వంబ‌ర్ నుంచి సెట్స్ పైకి

అయితే స్పిరిట్ లో ప్ర‌భాస్ కోసం మూడు లుక్స్ ను ఫైన‌ల్ చేయ‌గా, సినిమాలో ప్ర‌భాస్ మూడు లుక్స్ లో క‌నిపించ‌నున్నారా లేదా ఆ మూడింటిలో మ‌ళ్లీ ఒక లుక్ ను ఫైన‌ల్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. లుక్స్ తో పాటూ ఈ సినిమా షూటింగ్ పై కూడా మ‌రో అప్డేట్ వినిపిస్తోంది. స్పిరిట్ మూవీ మెయిన్ షూటింగ్ న‌వంబ‌ర్ ఆఖ‌రిలో మొద‌లై, దాదాపు ఐదు రోజుల పాటూ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. త్రిప్తి డిమ్రీ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ స్పిరిట్ కు సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News