డార్లింగ్ కోసం మరో సెట్.. ఈసారి ఎందుకంటే?
ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండటం.. ఒకదానికొకటి అన్నీ రాజాసాబ్ పై హైప్ ను పెంచుతున్నాయి.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. వాటిలో ది రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది. ది రాజా సాబ్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
వింటేజ్ లుక్ లో ప్రభాస్
వాస్తవానికి రాజా సాబ్ మొదలుపెట్టినప్పుడు మారుతి దర్శకత్వంలో సినిమా చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. ఈ సినిమాను ఆపేయమని, క్యాన్సిల్ చేయమని సోషల్ మీడియాలో ట్రెండ్స్ కూడా చేశారు. కానీ ప్రభాస్ కంటెంట్, మారుతిని నమ్మి రాజా సాబ్ ను ముందుకు తీసుకెళ్లారు. ప్రభాస్ నమ్మకాన్ని నిలబెడుతూ మారుతి, ప్రభాస్ ను ఈ మూవీలో వింటేజ్ లుక్ లో ప్రెజెంట్ చేసి అందరికీ షాకిచ్చారు.
ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారి..
దీంతో ఒక్కసారిగా రాజా సాబ్ పై అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ కూడా బావుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి చేస్తున్న హార్రర్ కామెడీ థ్రిల్లర్ కావడం, ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండటం.. ఒకదానికొకటి అన్నీ రాజాసాబ్ పై హైప్ ను పెంచుతున్నాయి.
ఇండియాలోనే అతి పెద్ద సెట్..
ఈ సినిమా కోసం హవేలి పేరుతో ఓ భారీ ప్యాలెస్ ను అజీజ్ నగర్ లో సెట్ వేశారు. రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ అక్కడే ఎక్కువ జరిగింది. సుమారు 41 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన ఈ సెట్ ఇండియాలోనే హార్రర్ సినిమా కోసం వేసిన అతి పెద్ద సెట్ గా నిలిచింది. ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర రాజీవ్ నంబియార్ హాలీవుడ్ స్థాయిలో నిర్మించారు.
ఖర్చు విషయంలో తగ్గేదేలే అంటున్న నిర్మాతలు
కాగా ఇప్పటికే రాజా సాబ్ కోసం ఓ స్పెషల్ సెట్ ను వేసిన మేకర్స్ ఇప్పుడు మరో సెట్ ను వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళనాడులోని కుంభకోణంలో ఓ సాంగ్ ను ప్లాన్ చేయగా, ఇప్పుడా సాంగ్‌ను అజీజ్ నగర్ లోనే సెట్ వేసి అందులోనే చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని, ఈ సెట్ ను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన కొత్త స్టూడియోలోనే వేయనున్నారని తెలుస్తోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న రాజా సాబ్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.