15 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి సినిమా చేస్తున్నా.. నా కెరీర్ బెస్ట్ పోస్ట‌ర్ అదే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ది రాజా సాబ్. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న రాజా సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.;

Update: 2026-01-08 09:53 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ది రాజా సాబ్. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న రాజా సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 8వ తేదీ సాయంత్రం నుంచే రాజా సాబ్ కు ప్రీమియ‌ర్ల‌ను ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఆల్రెడీ సినిమా నుంచి రిలీజైన పోస్ట‌ర్లు, టీజ‌ర్, ట్రైల‌ర్లు, దానికి తోడు ప్ర‌మోష‌న్స్ రాజా సాబ్ పై విప‌రీత‌మైన బ‌జ్ ను క్రియేట్ చేశాయి.

సందీప్ తో రాజా సాబ్ టీమ్ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూను ప్లాన్ చేయ‌గా ఆ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ తో పాటూ ముగ్గురు హీరోయిన్లుగా న‌టించిన మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూని ప్రముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా హోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఎట్రాక్ట్ చేస్తుంది. మేక‌ర్స్ తాజాగా ఈ ఇంట‌ర్వ్యూని రిలీజ్ చేయ‌గా అందులో ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను రివీల్ చేశారు.

డార్లింగ్ లాంటి సినిమా చేయాల‌నిపించింది

తాను 15ఏళ్ల కింద‌ట డార్లింగ్ మూవీ చేశాన‌ని, ఆ మూవీ చాలా ఫ‌న్నీగా, ఎంట‌ర్టైనింగ్ గా ఉంటుంద‌ని, ఇప్పుడ‌న్నీ యాక్ష‌న్ సినిమాల‌వుతుండ‌టంతో డ్రై గా అయిపోయిన‌ట్టు అనిపించి, మ‌ళ్లీ డార్లింగ్ లాంటి సినిమా చేయాల‌నిపించి మారుతికి చెప్తే, తాను రాజా సాబ్ క‌థ‌ను రెడీ చేశాడ‌ని, ఈ సినిమా మంచి కామెడీ

హ‌ర్ర‌ర్ అవుతుంద‌ని చెప్పారు ప్ర‌భాస్.

మొద‌టి వారం వాళ్ల‌తో మాట్లాడ‌లేదు

ప్ర‌భాస్ కు అమ్మాయిలంటే సిగ్గు క‌దా ఎలా మ్యానేజ్ చేశార‌ని హీరోయిన్ల‌ను అడిగితే, దానికి వారిచ్చిన ఆన్స‌ర్ చాలా ఫ‌న్నీ గా ఉంది. రాజా సాబ్ షూటింగ్ లో మొద‌టి వారం రోజులు ప్ర‌భాస్ త‌మ‌తో ఏం మాట్లాడ‌లేద‌ని, ఆ త‌ర్వాత నుంచి స్లో గా మాట్లాడార‌ని, ఆ త‌ర్వాత అంతా స‌ర‌దాగా సాగిపోయింద‌ని, రాజా సాబ్ షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేసిన‌ట్టు చెప్పారు.

కెరీర్ బెస్ట్ లుక్ అదే!

ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో త‌న త‌ర్వాతి సినిమా స్పిరిట్ ఫ‌స్ట్ లుక్ పై కూడా ప్ర‌భాస్ రియాక్ట్ అయ్యారు. స్పిరిట్ మూవీ పోస్ట‌ర్ త‌న కెరీర్లోనే బెస్ట్ అండ్ క‌ల్ట్ పోస్ట‌ర్ అని కామెంట్ చేశారు. సందీప్ కు ఆ ఐడియా ఎలా వ‌చ్చిందో కానీ పోస్టర్ అదిరిపోయింద‌ని చెప్ప‌గా, సందీప్ దానికి బ‌దులిస్తూ, ప్ర‌భాస్ నుంచి బాహుబ‌లి లాంటి మూవీ వ‌చ్చాక ఆయ‌న్ని ఇంకా కొత్త‌గా ఎలా చూపించాలా అనుకుంటున్న టైమ్ లో త‌న‌కు ఈ ఐడియా వ‌చ్చి, ఇలా చూపించాన‌ని చెప్పారు. ఇవే కాక ఇంకా మరెన్నో విష‌యాలు ఈ ఇంట‌ర్వ్యూలో ఉన్నాయి.


Full View


Tags:    

Similar News