'స్పిరిట్' లో పంజాబీ ఫ్లేవర్ ఊచకోతకు స్కెచ్!
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `స్పిరిట్` పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `స్పిరిట్` పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన నాటి నుంచి అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. సినిమా గురించి కొత్త కొత్త అప్ డేట్స్ ఎప్పుడొస్తాయా? అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భారీ సంఖ్యలో పంజాబీ నటులు నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఇప్పుడీ ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కథానాయకుడి పాత్రనే కాకుండా, కథా నేపథ్యాన్ని, నేటివిటీని పకడ్బందీగా డిజైన్ చేస్తుంటారు.
గతంలో ఆయన తెరకెక్కించిన `యానిమల్` చిత్రంలో పంజాబీ సంస్కృతిని, అక్కడి నటులను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించారు. తాజాగా `స్పిరిట్` కోసం కూడా అదే తరహాలో రా అండ్ రస్టిక్ ఫ్లేవర్‌ను జోడించేందుకు పంజాబీ తారాగణాన్ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సందీప్ మార్క్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్లు ఎంత ఇంటెన్సివ్‌గా, అగ్రెసివ్‌గా ఉంటాయో? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆల్ఫా-మేల్ క్యారెక్టర్‌కు ప్రభాస్ లాంటి కటౌట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఎలా ఉంటుందోనని మాస్ ఆడియన్స్ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.
పంజాబీ నటుల కలయికతో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా సాగుతోంది. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణా లతో, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సందీప్ ప్రతి పాత్రను ఎంతో విలక్షణంగా తీర్చిదిద్దుతుండటంతో షూటింగ్ లొకేషన్ నుండి వస్తోన్న విశేషాలు సినిమా రేంజ్‌ను , కథపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. పంజాబీ నటుల ఎంపిక వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్‌కు ఇప్పటికే నార్త్ ఇండియాలో తిరుగులేని మార్కెట్ ఉంది. `యానిమల్` ఘనవిజయంతో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ బెల్ట్‌లో బలమైన బ్రాండ్‌గా మారిపోయారు. `స్పిరిట్` లో పంజాబీ నటులను కూడా భాగం చేయడం ద్వారా నార్త్ మార్కెట్‌తో పాటు కెనడా, యూకే వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా `స్పిరిట్` చిత్రానికి భారీ ఓపెనింగ్స్ సాధించడానికి ఈ స్ట్రాటజీ ఎంతగానో ఉపయోగ పడుతుంది.`స్పిరిట్` చిత్రం రీజినల్ సినిమాగా కాకుండా, ప్రాపర్ గ్లోబల్ ఇండియన్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ప్రభాస్ లోని వింటేజ్ మాస్ యాంగిల్‌ను బయటకు తీయడంలో సందీప్ వంద శాతం సఫలమవుతారని కాస్టింగ్ ఎంపికలే నిరూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో `స్పిరిట్` నుండి రాబోయే అధికారిక ప్రకటనలు భారతీయ సినీ పరిశ్రమలో మరిన్ని ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.