'స్పిరిట్' షూట్‌కు ముందే ఈ బ్రేకులేంటి?
స్పిరిట్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ఇంత వరకు బయటికొచ్చింది.;
సందీప్‌రెడ్డి వంగా 'యానిమల్' తరువాత అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్న మూవీ 'స్పిరిట్'. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టి సిరీస్ వారితో కలిసి భద్రకాళి పిక్చర్స్ పై ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? సందీప్‌రెడ్డి వంగ తమ హీరోని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
స్పిరిట్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ఇంత వరకు బయటికొచ్చింది. అయితే ప్రభాస్ క్యారెక్టర్, తన మేకోవర్ ఎలా ఉండబోతోదన్నది మాత్రం ఇంత వరకు బయటికి రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రాజెక్ట్ దీపికా పదుకునే కారణంగా మరింతగా హాట్‌గా మారింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా దీపికను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడు.
తనను తీసుకున్నాడు. అయితే చర్చల దశలోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా లాభాల్లో వాటా, తెలుగు డబ్బింగ్ విషయంలో ఆంక్షలు, రెమ్యునరేషన్..ఇలా సందీప్‌కు దీపిక షరతులు విధించడంతో వాటిని బేర్ చేయలేక సందీప్ చేతులు ఎత్తేశారని, దీంతో దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'స్పిరిట్' ప్రారంభానికి ముందే ఈ బ్రేకులేంటని పలువురు వాపోతున్నారు.
బాలీవుడ్ మీడియా మాత్రం ఇందుకు భిన్నంగా వార్తలు ప్రచారం చేస్తోంది. దీపిక డిమాండ్‌లలో నిజాయితీ ఉందని, ఇటీవలే తను తల్లి అయినందున తనకున్న డిమాండ్ మేరకు డేట్స్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు వృత్తికి, వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ఉండేలా ఆమ ప్లాన్ చేసుకుందని అదెలా తప్పవుతుందంటూ వరుస కథనాల్ని ప్రచురించాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు సందీప్‌రెడ్డి వంగ స్పందించకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏ విషయంపై అయినా సూటిగా సమాధానాలు చెప్పే సందీప్‌రెడ్డి తాజా విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.