ప్రభాస్ క్షేమంగా ఉన్నారు.. భూకంపం వార్తలపై డైరెక్టర్ క్లారిటీ!

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ఆ తర్వాత బాహుబలి 2 కూడా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.;

Update: 2025-12-09 07:26 GMT

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ఆ తర్వాత బాహుబలి 2 కూడా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా ఈ రెండు చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి.. ప్రపంచదేశాలు తెలుగు సినిమా కోసం ఎదురుచూసేలా చేశాయి. ఇకపోతే ఈ రెండు చిత్రాలను రీ రిలీజ్ చేయకుండా.. రెండు చిత్రాలను కలిపి ఎడిట్ చేసి 'బాహుబలి ది ఎపిక్ ' అంటూ ఒకే మూవీగా రిలీజ్ చేశారు. అక్టోబర్ 31న వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని జపాన్లో డిసెంబర్ 12న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో పాటు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్లో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే అనుకోకుండా నిన్న అక్కడ భారీగా భూకంపం సంభవించడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళనలకు గురవుతున్నారు. దీంతో డైరెక్టర్ మారుతి ఈ విషయంపై అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. "నేను ప్రభాస్ తో మాట్లాడాను. ఆయన అక్కడ సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు" అంటూ తెలిపారు. ఇక డైరెక్టర్ మారుతి ప్రభాస్ క్షేమంగా ఉన్నారు అని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ప్రభాస్ విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ప్రతి ఒక్కటి పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫలితంతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూ నిర్మాతలకు లాభాల వర్షం కురిపిస్తున్నారు ప్రభాస్.

ఇక ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. మారుతీ దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నారు. అంతేకాదు తన సినీ కెరియర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తూ ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్ , రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది.

ఈ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం ఫౌజీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే సలార్ 2 , కల్కి 2 చిత్రాలు కూడా ప్రభాస్ కంప్లీట్ చేయనున్నారు.




Tags:    

Similar News