స్పిరిట్ షూటింగ్.. రాజా సాబ్ ప్రమోషన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సెట్స్ మీద ఉంది. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్ గా పూర్తైంది.;

Update: 2025-12-18 05:34 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సెట్స్ మీద ఉంది. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్ గా పూర్తైంది. ఐతే సందీప్ వంగ న్యూ ఇయర్ కోసం షూటింగ్ గ్యాప్ ఇద్దామని ముందు అనుకున్నారట. కానీ ప్రభాస్ లుక్ తో పాటు సినిమాలో విలన్ గా నటిస్తున్న వివేక్ ఓబెరాయ్ లుక్ కూడా రివీల్ అవుతుందని ఆ లుక్ తోనే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారట. అందుకే న్యూ ఇయర్ కి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

సంక్రాంతి కానుకగా రాజా సాబ్..

స్పిరిట్ షూటింగ్ లో పాల్గొనడానికి ప్రభాస్ అంతా రెడీనే కానీ జనవరిలో సంక్రాంతి కానుకగా రాజా సాబ్ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ టైం ఇవ్వాల్సి ఉంది. డిసెంబర్ లోనే ప్రభాస్ తన డేట్స్ మొత్తం రాజా సాబ్ ప్రమోషన్స్ కి ఇచ్చేశాడని టాక్. ఈ టైం లో సందీప్ వచ్చి స్పిరిట్ షూటింగ్ చేస్తానంటే కష్టమవుతుంది.

స్పిరిట్ కోసం ప్రభాస్ అడ్జెస్ట్ మెంట్ చేస్తున్నాడట. ఓ పక్క స్పిరిట్ షూట్ తో పాటు రాజా సాబ్ ప్రమోషన్స్ కి టైం ఇచ్చేలా అడ్జెస్ట్మెంట్స్ చూస్తున్నారని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా..

ప్రభాస్ రాజా సాబ్ సినిమా విషయంలో రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఐతే స్పిరిట్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే యానిమల్ డైరెక్టర్ ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. స్పిరిట్ లో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది.

సో డిసెంబర్ ఎండింగ్ లో ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ తో పాటు.. రాజా సాబ్ ప్రమోషన్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో రెండు సినిమాలకు తన రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ లైన్ లో ఉన్న సినిమాల గురించి చూస్తే నెక్స్ట్ ఇయర్ రాజా సాబ్, ఫౌజీ రిలీజ్ ప్లాన్ ఉండగా స్పిరిట్ ని 2027 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా కల్కి 2ని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రభాస్ డేట్స్ ఇస్తే కల్కి 2 పూర్తి చేసి 2028 రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. ఈమధ్యలోనే సలార్ 2 కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది.

Tags:    

Similar News