అప్పటి నుంచే ప్రభాస్ పై క్రష్: మాళవిక

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-29 10:22 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఒక హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనున్నారు.

2026 జనవరి 9వ తేదీన వరల్డ్ వైడ్ గా ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కానుండగా.. మాళవిక మోహనన్ ఇప్పుడు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటుండగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కోసం మరోసారి మాట్లాడారు. బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి మూవీ నుంచి ప్రభాస్ పై తనకు క్రష్ ఉందని మాళవిక మోహనన్ తెలిపారు. ప్రస్తుతం ఆ కామెంట్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంతకుముందు మరికొన్ని ఇంటర్వ్యూల్లో కూడా డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమ్మడు.

బాహుబలి మూవీ చూసిన తర్వాత తాను ప్రభాస్‌ కు పెద్ద ఫ్యాన్‌ గా మారానని తెలిపిన ఆమె.. ఆయనతో తెలుగులో డెబ్యూ చేయాలని కలలు కన్నానని కూడా చెప్పారు. ఆయనతో కలిసి పని చేయాలనే కోరిక మనసులో బలంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు ది రాజాసాబ్ మూవీతో ఆ కల నెరవేరిందని మాళవిక సంతోషం వ్యక్తం చేశారు.

అయితే బాహుబలి మూవీ ప్రభాస్ ను కేవలం ఒక స్టార్‌ గా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడిగా నిలబెట్టిందని కొనియాడారు. డార్లింగ్ యాక్టింగ్, వినయం, పని పట్ల నిబద్ధత తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఆ కోరికతోనే ఆయనతో వర్క్ చేయాలని సలార్ టైమ్ లో చాలా ట్రై చేశానని వెల్లడించారు.

సలార్ సినిమా సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ను కలిసి మాట్లాడానని, ఆ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనే ఆశతో ప్రయత్నం కూడా చేశానని తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు అది కుదరలేదని చెప్పారు. అయినప్పటికీ, ప్రభాస్‌తో కలిసి పనిచేయాలనే ఆశ మాత్రం తగ్గలేదని, నమ్మకంతో ఎదురుచూశానని మాళవిక మోహనన్ తెలిపారు.

ఇప్పుడు రాజా సాబ్ కు గాను ప్రభాస్‌ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం తన కెరీర్‌ లో స్పెషల్ ఫీట్ అని చెప్పారు. అయితే రాజా సాబ్ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన మాళవిక మోహనన్ లుక్స్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరి తన క్రష్ ప్రభాస్ తో యాక్ట్ చేస్తున్న రాజా సాబ్ మూవీతో అమ్మడు ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News