కాపీ కొట్టిన నిధి.. ఆ రోజులను గుర్తు చేసిందిగా!
ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిధి అగర్వాల్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారే ప్రయత్నం చేస్తోంది.;
ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిధి అగర్వాల్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. భారీ అంచనాల మధ్య 2026 జనవరి 9వ తేదీన పాన్ ఇండియా భాషల్లో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ కార్యక్రమాలను వేగంగా చేపట్టిన చిత్ర బృందం.. మరొకవైపు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది.
ఇదిలా ఉండగా డిసెంబర్ 1న లులూ మాల్ లో ది రాజాసాబ్ సినిమా నుంచి పాట విడుదల చేయగా.. ఆ సందర్భంగా అభిమానులు నిధి అగర్వాల్ ను చుట్టుముట్టారు. ముఖ్యంగా ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ఘటనను ఉద్దేశించి నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన కామెంట్లు ఇప్పటికీ వివాదంగా మారాయి. ఇక లులూ మాల్ ఘటన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య ఈవెంట్ కి హాజరయ్యింది నిధి అగర్వాల్.. ఇక్కడ కూడా తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను నిధి అగర్వాల్ షేర్ చేసింది. అందులో ఆమె లవ్ సింబల్ ఫోజు ఇస్తూ పంచుకున్న కొన్ని ఫోటోలను అభిమానులు పరిశీలించి ఎక్స్ వేదికగా స్పందించారు. నిధి అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలలో లవ్ ఫోజ్ ఇస్తున్న ఫోటో హైలెట్గా నిలిచింది. అందులో ఆమె చేతిలో ఏదో రాసుకున్నట్టు ఉంది. ఇది చూసిన ఒక నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఈ ఫోటోని షేర్ చేస్తూ.. "మీరు చేతిలో ఏదో రాసుకున్నారు. అత్యుత్సాహంతో అడగకుండా ఉండలేకపోతున్నాను. మీరు చేతుల్లో అలా రాసుకున్న విషయాన్ని చూస్తుంటే.. నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి" అంటూ కామెంట్ చేశారు. అయితే దీనిని రీ ట్వీట్ చేస్తూ.." అయ్యో మళ్లీ దొరికిపోయానే" అంటూ కామెంట్ చేసింది నిధి అగర్వాల్. ఇది చూసిన చాలామంది నెటిజన్లు కూడా నిజమే.. మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్ టైం లోనో లేక మరేదైనా టైం లో ఇలా చేతుల్లో రాసుకునే వాళ్ళం అంటూ తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికైతే నిధి అగర్వాల్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అందరికీ తమ జ్ఞాపకాలను గుర్తు చేసింది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఆమె తన చేతిలో ఏం రాసుకుంది అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.
నిధి అగర్వాల్ విషయానికొస్తే.. సవ్యసాచి సినిమాతో సినీ కెరియర్ ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నిధి.. వచ్చే యేడాది రాజా సాబ్ సినిమాతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించబోతోంది.