ఆ డైరెక్టర్స్ ఇలా తగులుకున్నారేంటి భయ్యా!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి లాంటి వాళ్లు మన స్టార్స్ డేట్స్ లభించడం లేదని బాలీవుడ్ స్టార్స్ వెంటపడుతుంటే తమిళ, మలయాళ డైరెక్టర్స్ టాలీవుడ్ స్టార్స్ వెంటపడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.;
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి లాంటి వాళ్లు మన స్టార్స్ డేట్స్ లభించడం లేదని బాలీవుడ్ స్టార్స్ వెంటపడుతుంటే తమిళ, మలయాళ డైరెక్టర్స్ టాలీవుడ్ స్టార్స్ వెంటపడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్‌లని సొంతం చేసుకున్న స్టార్‌లతో తమిళ డైరెక్టర్స్ తమిళ డైరెక్టర్స్ పోటా పోటీగా భారీ స్థాయి సినిమాలు చేస్తుంటే ఇదే జోరులో మేము సైతం అంటూ మలయాళ డైరెక్టర్స్ కూడా రెడీ అవుతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో సినిమాలని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ స్థాయి భారీ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపనీ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ చిత్రాల నిర్మాత కళానిధి మారన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ లేడీ దీపికా పదుకునే ప్రధాన హీరోయిన్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తుండగా, మరో రెండు కీలక పాత్రల్లో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ అండర్ ప్రొడక్షన్‌లో ఉండగానే బన్నీ మరో తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించనున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ వ్యూస్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. అట్లీ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే దీన్ని పట్టాలెక్కించాలని మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు.
దీని తరువాత బన్నీ మలయాళ నటుడు, డైరెక్టర్ బసిల్ జోసెఫ్‌తో #AA24ని చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల శిరీష్ వివాహ వేడుకలో బసిల్ జోసెఫ్ పాల్గొనడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. బసిల్ జోసెఫ్‌తో బన్నీ సినిమా కన్ఫర్మ్ చేశాడని, దీనికి సంబంధించిన స్టోరీ రెడీ అవుతోందని ఇన్ సైడ్ టాక్. బన్నీ వ్యవహారం ఇలా ఉంటే తనకు తోడుగా ఇప్పుడు ప్రభాస్ కూడా చేరినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్‌రెడ్డి వంగతో`స్పిరిట్`, నాగ్ అశ్విన్‌తో `కల్కి 2` మూవీస్‌ని మొదలు పెట్టిన ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అది తెలుగు డైరెక్టర్‌తో కాకుండా ఈ సారి బన్నీ తరహాలోనే మలయాళ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడట. 2024లో `కిష్కింద కాండం` విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.77కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి దింజిత్ అయ్యతన్ దర్శకుడు. తనతోనే ప్రభాస్ ఓ భారీ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్‌ని కలిసిన దింజిత్ ఓ ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అది నెట్టింట వైరల్‌గా మారి చర్చకు దారి తీసింది. ప్రభాస్, దింజిత్ కలయికలో హోంబలే ఫిలింస్ ఈ మూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తోందని వార్తలు షిరానే చేయడం మొదలైంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ మన స్టార్స్‌ని తమిళ్ మలయాళ డైరెక్టర్స్ ఇలా తగులుకున్నారేంటి భయ్యా! అని వాపోతున్నారు.