టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!
ప్రస్తుతం టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోల సరసన నటించేందుకు కొద్దిమంది సీనియర్ నటీమణులకే పరిమితం కాకుండా కొత్త తరం హీరోయిన్ల ఎంట్రీతో టాలీవుడ్ కళకళలాడుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోల సరసన నటించేందుకు కొద్దిమంది సీనియర్ నటీమణులకే పరిమితం కాకుండా కొత్త తరం హీరోయిన్ల ఎంట్రీతో టాలీవుడ్ కళకళలాడుతోంది. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యువ నటీమణులు అద్భుతమైన నటనతో పాటు గ్లామర్‌తోనూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి. `సప్తసాగరాలు దాటి` చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తోంది.
సహజమైన అభినయంతో పాటు హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న రుక్మిణి టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ కూడా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. గ్లామర్ అండ్ యాక్టింగ్ టాలెంట్‌తో ఇబ్బడి ముబ్బడిగా క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్న అమ్మడు రాబోయే రోజుల్లో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద నిర్మాణ సంస్థలు .. ప్రముఖ దర్శకుల చిత్రాల్లో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి.
అలాగే బాలీవుడ్‌లో నేషనల్ క్రష్‌గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న త్రిప్తి దిమ్రి ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తన పాగా వేసేందుకు అడుగులు వేస్తోంది. గ్లామర్ రోల్స్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న త్రిప్తి తెలుగులోనూ ట్రెండింగ్ ప్రాజెక్ట్‌లలో భాగం అవుతోంది. ఆమె క్రేజ్ చూస్తుంటే టాలీవుడ్‌లో త్వరలోనే అమ్మడు కీలక నాయికగా మారడం తథ్యం. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. 'హిట్' తో మంచి విజయాన్ని అందుకున్న అమ్మడు స్టార్ హీరోలకు ప్రమోట్ అవుతుంది.
ఇప్పటికే విక్టరీ వెంకటేష్ కు జోడీగా 'ఆదర్శ కుటుంబంలో' నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం హిట్ అయితే నటిగా మరింత బిజీ అవుతుంది. ఇతర భాషల్లో కూడా అవకాశాలు పెరుగుతాయి. ఇలా కొత్త తరం నటీమణుల రాకతో టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరిగింది. కేవలం గ్లామర్ డాల్స్‌లా కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తమదైన నటనతో మెప్పిస్తున్నారు.
దర్శకులు కూడా రొటీన్ హీరోయిన్ పాత్రలకు స్వస్తి చెప్పి నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఈ కొత్త భామలకు ఇస్తుండటం విశేషం. మొత్తంగా రుక్మిణి వసంత్, ఇమాన్వి, తృప్తి దిమ్రి వంటి నటీమణుల ఎంట్రీ టాలీవుడ్ భవిష్యత్తు చిత్రాల రూపురేఖలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. రాబోయే కాలంలో తెలుగు సినిమా పరిశ్రమను ఏలేది నూతన తరం భామలేననడంలో ఎలాంటి సందేహం లేదు. భామల గ్లామర్ ... అభినయం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.