అఖండ గెటప్ రచ్చ.. అసలు నిజం ఇదే!

ఇందులో బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ చేసిన ఒక ప్రత్యేకమైన గెటప్ కి సంబంధించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై రకరకాల నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Update: 2026-08-07 10:04 GMT

వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ కంప్లీట్ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. సినిమా రిలీజ్ రోజున ఒక పక్క మేకర్స్, అభిమానులు ప్రమోషన్స్ హడావిడిలో ఉంటే, సోషల్ మీడియాలో మాత్రం ఊహించని విధంగా ఒక కొత్త రచ్చ మొదలైంది. ఇందులో బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ చేసిన ఒక ప్రత్యేకమైన గెటప్ కి సంబంధించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై రకరకాల నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

సినిమాలోని మురళీధర్ గౌడ్ లుక్ బయటకు రాగానే కొందరు పనికట్టుకుని దాన్ని నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ అఖండ గెటప్ తో పోల్చడం స్టార్ట్ చేశారు. ఆ రెండు ఫోటోలను పక్కపక్కన పెట్టి కావాలనే కొన్ని నెగెటివ్ పోస్టులు వేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ గెటప్ వల్ల అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోందని కూడా కథనాలు రావడంతో వివాదం కాస్తా సోషల్ మీడియా అంతటా పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది.

కానీ ఈ వివాదంలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సినిమా చూశాక అర్థమవుతుంది. చూసిన వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. బాలయ్య అఖండ క్యారెక్టర్ కి, ఇందులో మురళీధర్ గౌడ్ చేసిన ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ కి కనీసం ఒక్క శాతం కూడా సంబంధం లేదు. ఆ గెటప్ కు, ఈ గెటప్ కు అస్సలు ఏ కోశానా పోలికే లేదని, ఇదంతా కేవలం కొంతమంది పనికట్టుకుని సృష్టిస్తున్న అపోహ మాత్రమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కేవలం సోషల్ మీడియాలో లైక్స్ తెచ్చుకోవడం కోసం, లేనిపోని ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్టులు మరికొందరు చెబుతున్నారు. ఆ రెండు పాత్రల స్వభావం, వాటి నేపథ్యం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇలా కావాలనే పోలికలు తెచ్చి లేని వివాదాలు సృష్టించడం వల్ల ప్రేక్షకుల్లో అనవసరమైన కన్ఫ్యూజన్ వస్తుంది తప్ప, ఈ రచ్చ వల్ల సినిమా కలెక్షన్స్ కు వచ్చే నష్టం ఏమీ ఉండదు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి కొరియన్ కనకరాజు సినిమాలో మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేశారు. ఆ పాత్ర సినిమా కథలో చాలా కీలకంగా ఉంటూనే ఆడియన్స్ కి అడుగడుగునా మంచి ఫన్ జనరేట్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం మేకర్స్ కి అస్సలు లేదు. పైగా సెకండాఫ్ లో ఆ రోల్ సినిమాకే ఒక పెద్ద హైలైట్ గా నిలుస్తుందని, సినిమాకు ఇది చాలా పాజిటివ్ వర్షన్ అని ప్రేక్షకుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.

కాబట్టి ఒక పోస్టర్ చూసో లేదా ఎవరో పెట్టిన ఫేక్ ట్వీట్ చూసో సినిమా మీద ఒక అంచనాకు రావడం ఏమాత్రం కరెక్ట్ పద్ధతి కాదనీ చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పనికట్టుకుని చేసే ఇలాంటి ఫేక్ ప్రచారాలను అస్సలు పట్టించుకోకండనీ మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. నేరుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే అందులోని అసలు ఫన్ మ్యాజిక్ ఏంటో ప్రతి ఒక్కరికీ ఈజీగా అర్థమవుతుందని సినీ లవర్స్ సూచిస్తున్నారు.

Tags:    

Similar News