ఫ్రైడే ఓటీటీ మూవీస్.. ఆ 2 డోంట్ మిస్!

థియేటర్లలో అలరించిన బాక్సాఫీస్ హిట్ల నుంచి సరికొత్త థ్రిల్లర్ల వరకు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్‌లో నిలిచిన మూవీస్ వివరాలు చూద్దాం..

Update: 2026-08-07 10:47 GMT

వారాంతం వచ్చిందంటే చాలు సినీ ప్రియులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు ఆసక్తిగా చూస్తుంటారు. వారి వినోదం కోసం ఈ వారం ఓటీటీ వేదికలు భారీ కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషలకు చెందిన దాదాపు 17 సినిమాలు, సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్లలో అలరించిన బాక్సాఫీస్ హిట్ల నుంచి సరికొత్త థ్రిల్లర్ల వరకు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్‌లో నిలిచిన మూవీస్ వివరాలు చూద్దాం..

జీ5లో అలరిస్తున్న 'లెనిన్' & 'వంద దేవుళ్లు':

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మాస్ యాక్షన్ డ్రామా 'లెనిన్' థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుని, ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అఖిల్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాను ఓటీటీ ప్రియులు అస్సలు మిస్ కాకూడదు. ఇక దీంతో పాటు విజయ్ ఆంటోని నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వంద దేవుళ్లు' కూడా జీ5లో అందుబాటులోకి వచ్చింది. మరాఠీ చిత్రం 'తుంబడ్ చీ మంజులా' కూడా జీ5 వేదికగా అలరిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులు ఎదురుచూసిన ‘వదంది సీజన్ 2’ ఇప్పుడు తెలుగు, తమిళం సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే 'ఓ సుకుమారి' చిత్రం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్ మూవీ 'ది సూపర్ మారియో గెలాక్సీ' సన్ నెక్స్ట్‌లో మలయాళ చిత్రం 'సత్యతిల్ సంబవిచతు' మనోరమ మ్యాక్స్‌లో 'పొంగళ' విడుదలయ్యాయి.

సస్పెన్స్, యాక్షన్ వెబ్ సిరీస్‌లు:

వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అలరిస్తున్న సినిమాలతో పాటు పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'ఆపరేషన్ సఫేద్ సాగర్' అనే యాక్షన్ సిరీస్ పలు భాషల్లో అందుబాటులో ఉంది. ఇక కొరియన్ డ్రామా 'అవర్ స్టిక్కీ లవ్', కామెడీ షో 'రికీ గెర్వైస్: ఆలే క్యాట్' 'డెత్ ఇంక్- సీజన్ 4' వంటి సిరీస్‌లు డిజిటల్ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

థియేటర్లలో కొత్త సినిమాలు:

ఓటీటీ వినోదంతో పాటు థియేటర్లలోనూ ఈ శుక్రవారం సరికొత్త చిత్రాలు సందడి చేస్తున్నాయి. వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు'తో పాటు 'కేజేక్యూ', 'అనకాపల్లి', 'అమ్మ నాకు అబ్బాయి కావాలి' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే లోకేష్ కనగరాజ్ నటించిన 'డిసి', మాధవన్ నటించిన 'జీడీ నాయుడు' చిత్రాలు థియేటర్లకు వచ్చాయి. వీటికి తోడు మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ హిట్ 'దూకుడు' రీ-రిలీజ్ కావడం విశేషం.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'లెనిన్' మరియు 'వదంది సీజన్ 2' చిత్రాలను ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో నిండిన ఈ వారాంతాన్ని మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే హాయిగా ఆస్వాదించండి.

Tags:    

Similar News