మృణాల్ ఖాతాలో అదొక్కటే ఎందుకు..?
స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి అప్గ్రేడ్ అయ్యి ఆల్రెడీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ కి తెలుగులో సీతారామం సినిమా పడటం ఆమె కెరీర్ ని మరింత క్రేజీగా మారింది;
స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి అప్గ్రేడ్ అయ్యి ఆల్రెడీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ కి తెలుగులో సీతారామం సినిమా పడటం ఆమె కెరీర్ ని మరింత క్రేజీగా మారింది. సీతారామం తో టాలీవుడ్ లో అమ్మడికి మంచి క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది. ఐతే హాయ్ నాన్న వర్క్ అవుట్ అవ్వగా ఫ్యామిలీ స్టార్ మిస్ ఫైర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత మృణాల్ మరో తెలుగు ఆఫర్ అందుకోలేదు.
ఫైనల్ గా అడివి శేష్ డెకాయిట్ లో ముందు శృతి హాసన్ ని అనుకున్న రోల్ కి ఆమె ఎగ్జిట్ అవ్వడంతో మృణాల్ వచ్చి చేరింది. ఐతే డెకాయిట్ తో నెక్స్ట్ ఇయర్ మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది మృణాల్ ఠాకూర్. అందానికి అందం, నటనకు నటన రెండు ఉన్నా కూడా తెలుగులో 3 సినిమాలు చేసి అందులో రెండు హిట్లు పడినా చివరగా వచ్చిన ఫ్లాప్ సినిమా వల్ల మృణాల్ కి తెలుగు ఆఫర్లు రావట్లేదు.
సీతారామం, హాయ్ నాన్న హీరోకి ఏమాత్రం తగ్గని పాత్రలో..
తన దాకా వచ్చిన కొన్ని కథలను కూడా మృణాల్ కాదనేసిందన్న టాక్ కూడా ఉంది. ఐతే మృణాల్ అసలు ఎలాంటి సినిమాల్లో నటించాలని అనుకుంటుందో తెలియాల్సి ఉంది. సీతారామం, హాయ్ నాన్న రెండు సినిమాల్లో హీరోకి ఏమాత్రం తగ్గని పాత్రలో ఇంకా చెప్పాలయింటే స్టోరీలో హీరోయిన్ రోల్ చాలా కీలకంగా మారాయి. ఫ్యామిలీ స్టార్ లో ఆ టైప్ కాదు ఓ సగటు హీరోయిన్ గానే చేసింది.
సో మృణాల్ ని అలా బలమైన రోల్స్ లోనే చూడాలని ఆడియన్స్ భావిస్తున్నారు. అడివి శేష్ తో చేస్తున్న డెకాయిట్ మృణాల్ కి మరోసారి లక్ కలిసి వచ్చేలా ఉంది. సినిమాలో ఆమె లుక్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక అడివి శేష్ సినిమా అంటే ష్యూర్ షాట్ హిట్ అన్నట్టే లెక్క. సో మృణాల్ కి మరో హిట్ పడినట్టే అని చెప్పుకుంటున్నారు.
బాలీవుడ్ లో తనకు ఉన్న గ్లామర్ ఇమేజ్..
ఐతే డెకాయిట్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటన్నది తెలియలేదు. మృణాల్ ఠాకూర్ మాత్రం కెరీర్ లో సినిమాలు కౌంటింగ్ లెక్క కాదు ఎలాంటి సినిమాలు చేశామన్నదే లెక్క అంటుంది. బాలీవుడ్ లో తనకు ఉన్న గ్లామర్ ఇమేజ్ ని సౌత్ లో అదే తెలుగులో మంచి రోల్స్ చేస్తూ ఇమేజ్ ని మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది అమ్మడు. డెకాయిట్ రిజల్ట్ తో పాటు అమ్మడు నెక్స్ట్ చేసే సినిమాల మీదే మృణాల్ ఠాకూర్ ఫోకస్ చేస్తుంది.
టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ కోసం ఎదురుచూస్తున్న మృణాల్ తనకు ఆ కేపబిలిటీ ఉందని ప్రూవ్ చేసుకున్నా కూడా ఎక్కడో ఇంకా డౌట్ కొడుతుంది. అందుకే డెకాయిట్ సక్సెస్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది మృణాల్. నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా త్వరలో ఒక డెసిషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.