ప్ర‌భాస్ ఇక‌పై వారికి దూరంగా ఉంటాడా?

ప్ర‌భాస్ చేసిన‌ బాహుబ‌లి త‌రువాత పాన్ ఇండియా సినిమాల ప్ర‌భావం పెరిగిపోయింది. ఇప్పుడు ఎవ‌రిని ర‌దిలించినా పాన్ ఇండియా అంటున్నారు.;

Update: 2026-02-12 23:30 GMT

ప్ర‌భాస్ చేసిన‌ బాహుబ‌లి త‌రువాత పాన్ ఇండియా సినిమాల ప్ర‌భావం పెరిగిపోయింది. ఇప్పుడు ఎవ‌రిని ర‌దిలించినా పాన్ ఇండియా అంటున్నారు. ఇందులో కొంత మంది స‌క్సెస్‌లు కూడా సాధిస్తున్నారు. బ‌డ్జెట్ మూవీస్ చేస్తూ ఐదు భాష‌ల్లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మ‌న టాలీవుడ్ సీనియ‌ర్‌ స్టార్స్ ఇప్పుడు ట్రాక్ మార్చారు. యంగ్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో వ‌స్తుండ‌టం, జెన్‌జీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుండ‌టంతో యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌కు అవ‌కాశాలు ఇస్తున్నారు.

ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో నిలిచిన హీరో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్. యంగ్ అండ్ నాన్ ఫేమ్ డైరెక్ట‌ర్స్‌కి అవ‌కాశాలిచ్చాడు. 2013 నుంచి నిన్న‌టి 2025 వ‌ర‌కు దాదాపు ఐదుగురు డైరెక్ట‌ర్ల‌కు డైరెక్ట‌ర్స్‌గా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అందులో ఒక్క‌రంటే ఒక్క‌రు మాత్ర‌మే ప్ర‌భాస్ ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చారు. కానీ మిగ‌తా న‌లుగురు డైరెక్ట‌ర్స్ మాత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. రీసెంట్‌గా ప్ర‌భాస్ యంగ్ డైరెక్ట‌ర్‌కి అవ‌కాశం ఇవ్వాల‌ని చేసిన హార‌ర్ కామెడీ ప్ర‌భాస్ కెరీర్‌లోనే భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచి అభిమానుల్ని షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే.

నార్మ‌ల్ డైరెక్ట‌ర్స్‌కి ప్రూవ్ చేసుకునే అవ‌కాశం ఇస్తున్నా కానీ వారు దాన్ని స‌ద్వినియోగం చేసుకోక‌పోవ‌డంతో ప్ర‌భాస్ మైండ్ సెట్‌లో మార్పులు వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. తాజా ప‌రిణామాలు, ఫ‌లితం నేప‌థ్యంలో ప్ర‌భాస్ ఈ విష‌యంలో మారిన‌ట్టుగా చెబుతున్నారు. సినిమా మేకింగ్ విష‌యంలో కావాల్సిన విధంగా స‌హ‌క‌రించినా, అనుకున్న‌న్ని డేట్స్ కేటాయించినా వాటిని స‌క్ర‌మంగా ఉప‌యోగించుకోవ‌డంలో ఫెయిల్ అవుతుండ‌టంతో ప్ర‌భాస్ ఇప్పుడు విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నాడు.

రీసెంట్‌గా విడుద‌లైన ప్ర‌భాస్ హార‌ర్ కామెడీ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోగా క‌థ‌, క‌థ‌నాలు ఆస్త‌వ్య‌స్తంగా ఉండ‌టం, త‌న స్టార్‌డ‌మ్ స్థాయికి త‌గ్గట్టుగా ఏమాత్రం లేక‌పోవ‌డంతో ఇలాంటి డైరెక్ట‌ర్ల‌కు అవ‌కాశాలు ఎందుకు ఇస్తున్నాడ‌ని, త‌న గ్రాఫ్‌ని తానే త‌గ్గించుకుంటున్నాడ‌నే విమర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. మూడు నాలుగేళ్ల క్రితం ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌కు ఛాన్స్ ఇచ్చి ప్ర‌భాస్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం తెలిసిందే. మ‌ళ్లీ ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఇక‌పై వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ మీద అనుభ‌వం లేని డైరెక్ట‌ర్ల‌తో పీరియాడిక్‌, ఫాంట‌సీ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని ప్ర‌భాస్ నిర్ణయించుకున్నాడ‌ట‌. అలా ఎక్స్‌పీరియ‌న్స్‌, వాటిపై ప‌ట్టులేని వారితో క‌ల‌సి పని చేస్తే ఔట్‌పుట్ చాలా పూర్‌గా ఉంటుంద‌ని ఇటీవ‌ల రెండు సినిమాలు నిరూపించ‌డంతో ప్ర‌భాస్ ఇక‌పై ఆ విష‌యాల్లో పూర్తి స్థాయిలో అనుభ‌వం ఉన్న వారితోనే అలాంటి మూవీస్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tags:    

Similar News