కల్కి 2 కోసం ఎన్నేళ్లు వేచిచూడాలో..?
ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా ఆ సినిమా షూటింగ్ లోనే చేస్తున్నాడు ప్రభాస్.;
ప్రభాస్ సినిమాలు మొదలు పెట్టడమే కానీ వాటి రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం చెప్పడం కష్టమనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. బాహుబలి నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు. ఆదిపురుష్ అంటూ డైరెక్ట్ గా బాలీవుడ్ డైరెక్టర్ తో ఒక సినిమా చేశాడు. ఐతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఐతే సలార్ 1 అంటూ ఒక భారీ సినిమా చేశాడు రెబల్ స్టార్. కె.జి.ఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది.
సలార్ 1 మాస్ హిట్ అందుకున్నాక కల్కి 2898 AD అంటూ మరో అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి సినిమా 500 కోట్ల పైన బడ్జెట్ తో రూపొందించారు. ఐతే కల్కి 1 పూర్తైంది సరే కల్కి 2 ఎప్పుడన్న డౌట్ మొదలైంది. ఆ సినిమాకు ఎక్కువ టైం తీసుకునేది లేదు 2025 లోనే రిలీజ్ అని అప్పట్లో చెప్పినా ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్టు ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందా అన్న ప్రశ్న వినిపిస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా ఆ సినిమా షూటింగ్ లోనే చేస్తున్నాడు ప్రభాస్. మరోపక్క హనుతో ఫౌజీ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే స్పిరిట్ లైన్ లో ఉంది. సందీప్ వంగ ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా స్టార్ట్ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. ఇవే కాకుండా ప్రభాస్ కల్కి 2, సలార్ 2 సినిమాలు చేయాలి.
సలార్ 2 ఎలాగు ప్రశాంత్ నీల్ తారక్ సినిమా అయ్యాక ఉండొచ్చు. ఐతే కల్కి 2 ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభాస్ రాజా సాబ్ లాంటి సినిమాకే రెండేళ్లు పైన టైం తీసుకున్నాడు. ఇక కల్కి 2 మరింత భారీగా ఉంటుందని అంటున్నారు. మరి అలాంటి సినిమాకు ఇంకెంత టైం తీసుకుంటాడు అన్నది చూడాలి. సలార్ 2, కల్కి 2 సినిమాలు ఎలా లేదన్నా 3, 4 ఏళ్ల దాకా ఎక్స్ పెక్ట్ చేయడం పొరపాటే అయ్యేలా ఉంది. ప్రభాస్ కూడా వరుస సినిమాలు కమిట్ అవ్వడమే కాదు వాటిని పూర్తి చేసేలా కాస్త ఎక్కువ ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తే బెటర్. మరి అసలు ప్రభాస్ సినిమాలు లేట్ ఎక్కడ జరుగుతుంది అన్నది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేస్తూనే ఉన్నారు.