గుస‌గుస‌: 'స్పిరిట్' మూవీలో ప్ర‌భాస్ ఫ్రెండ్‌ గోపిచంద్?

పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ `స్పిరిట్`.

Update: 2026-09-07 02:22 GMT

పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ `స్పిరిట్`. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక పవర్‌ఫుల్(కీల‌క‌) పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. గతంలో ప్రభాస్-గోపీచంద్‌ల మధ్య ఉన్న ప్రాణస్నేహం గురించి అందరికీ తెలిసిందే. మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే గోపీచంద్‌తో కలసి చేయాలని ఉందని ప్రభాస్ కూడా గతంలో ప్రకటించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.

ఇటీవల జరిగిన ఒక విలేకరుల సమావేశంలో `స్పిరిట్` మూవీలో గోపీచంద్ నటిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు నేరుగా సందీప్ రెడ్డి వంగాను ప్రశ్నించారు. అయితే ఈ వార్తలపై వంగా ఎలాంటి ఖండన ఇవ్వకుండా.. కేవలం చిరునవ్వు చిందించి మౌనంగా ఉండిపోయారు. సాధారణంగా ఏదైనా రూమర్ అబద్ధమైతే సందీప్ వెంటనే స్పష్టం చేస్తారని.. ఆయన ఇలా నవ్వి ఊరుకోవడం వెనుక ఏదో బలమైన చర్చ జరుగుతోందనే సంకేతం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభాస్ సజెషన్ తోనే సందీప్ వంగా ఈ పాత్ర విషయమై గోపీచంద్‌ను సంప్రదించి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర ఎలా ఉండబోతోందనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథ ప్రకారం ప్రభాస్‌కు నమ్మకమైన పోలీస్ ఫ్రెండ్‌గానో లేదా కథకు సమాంతరంగా సాగే ఒక పవర్‌ఫుల్ పారలల్ హీరో క్యారెక్టర్‌గానో గోపీచంద్ కనిపించే అవకాశం ఉంది. మొదట్లో ఇద్దరి మధ్య విభేదాలు ఉండి ఆ తర్వాత ఒకే లక్ష్యం కోసం చేతులు కలిపే పవర్‌ఫుల్ పాత్రను సందీప్ డిజైన్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో జయం, నిజం, వర్షం చిత్రాల్లో విలన్‌గా మెప్పించిన చరిత్ర గోపీచంద్‌కు ఉంది కాబట్టి.. మరోసారి ప్రతినాయకుడిగా ముఖాముఖి పోరాడినా ఆశ్చర్యపోనవసరం లేదనే చ‌ర్చా వేడెక్కిస్తోంది.

గోపీచంద్ మంచి నటుడైనా గత కొంతకాలంగా సరైన విజయం లేక బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో `స్పిరిట్` లాంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం కెరీర్‌కు మైలేజ్ ఇస్తుందనడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలలో క్యారెక్టర్లను ఎంతో ఇంటెన్స్‌గా చూపించే సందీప్ వంగా.. గోపీచంద్‌ను నిజంగానే ఈ సినిమాలో నటింపజేస్తే.. అది ఒక సరికొత్త కంబ్యాక్ అవుతుందని... అత‌డిలోని సరికొత్త నటుడిని బయటకు తీస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. ప్రభాస్- గోపిచంద్ కాంబినేషన్‌లో సీన్లు - స్క్రిప్ట్ డిజైన్‌పై పూర్తి స్పష్టత వచ్చాక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెరపై ప్రభాస్ - గోపీచంద్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని.. అందుకే ఈ కాంబినేషన్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News