'సింగా' గోపీచంద్.. మాస్టర్ ప్లాన్ పెద్దదే!
ఫైట్ మాస్టర్‌గా వెంకట్‌కు ఇండస్ట్రీలో మంచి అనుభవం ఉంది. ఎన్నో సినిమాలకు యాక్షన్ సన్నివేశాలు రూపొందించిన ఆయన 'సింగా'తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
గోపీచంద్ సినిమాల్లో యాక్షన్‌కు ఎప్పుడూ కొదవ ఉండదు. కానీ ఈసారి ఆ యాక్షన్‌ను తెరకెక్కించడానికి ఫైట్ మాస్టర్ స్వయంగా దర్శకుడిగా మారడం హైలెట్. వెంకట్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సింగా' నుంచి కొత్త పోస్టర్ బయటకొచ్చింది. చేతిలో పొడవాటి ఆయుధం పట్టుకుని, పీరియడ్ గెటప్‌లో గోపీచంద్ కనిపిస్తున్నారు. గతంలో వచ్చిన ఫస్ట్ లుక్‌తో పోలిస్తే ఈసారి పాత్రను మరో కోణంలో చూపించారు. ముఖ్యంగా సినిమా కోసం ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్ ఆసక్తి రేపుతోంది.
ఫైట్ మాస్టర్‌గా వెంకట్‌కు ఇండస్ట్రీలో మంచి అనుభవం ఉంది. ఎన్నో సినిమాలకు యాక్షన్ సన్నివేశాలు రూపొందించిన ఆయన 'సింగా'తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాధారణంగా ఫైట్ మాస్టర్లు దర్శకులుగా మారినప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఎక్కువ అంచనాలు ఉంటాయి. అయితే ఇక్కడ వెంకట్ ఎంచుకున్నది కేవలం ఫైట్లతో నడిచే కథ కాదట. యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక గోపీచంద్ లుక్ విషయంలోనూ మేకర్స్ ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. మొదటి గ్లింప్స్‌లో రక్తంతో తడిసిన ముఖం, రఫ్ గెటప్‌తో కనిపించిన ఆయన ఇప్పుడు పూర్తిగా పీరియడ్ కాస్ట్యూమ్స్‌లో ఉన్నారు. చుట్టూ అడవి వాతావరణం, భారీ ఆయుధంతో ఉన్న పోస్టర్ చూస్తే కథలో రెండు భిన్నమైన పరిస్థితులు ఉండొచ్చనే హింట్ వస్తోంది. అయితే ఈ రెండు లుక్స్ మధ్య ఉన్న కనెక్షన్‌ను ఇంకా బయటపెట్టలేదు.
మరోవైపు 'సింగా' షూటింగ్ ఇప్పటికే యాభై శాతం పూర్తయింది. ఇటీవల ప్రత్యేకంగా నిర్మించిన అడవి సెట్స్‌లో భారీ షెడ్యూల్ ముగించారు. సహజమైన అడవుల్లో షూటింగ్ చేయకుండా ప్రత్యేక సెట్స్ నిర్మించడం వెనక యాక్షన్ సన్నివేశాల అవసరం కూడా ఉండొచ్చు. ప్రస్తుతం డిసెంబర్‌లో మొదలయ్యే తదుపరి షెడ్యూల్ కోసం మరింత పెద్ద సెట్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
గోపీచంద్‌కు కూడా ఈ సినిమా కెరీర్ పరంగా కీలకమే. గత కొంతకాలంగా మాస్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందడం లేదు. కొత్త దర్శకుడిని నమ్ముకుని మరోసారి తనకు బాగా కలిసొచ్చిన యాక్షన్ జానర్‌లోకి దిగుతున్నారు. అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా కాకుండా పీరియడ్ సెటప్ ఎంచుకోవడం కొంత భిన్నమైన ప్రయత్నం. గోపీచంద్ ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఇలాంటి పాత్రలు బాగా సరిపోతాయి.
70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనార్కలి నాజర్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక మిగిలిన షూటింగ్‌ను డిసెంబర్ షెడ్యూల్‌తో ఫినిష్ చేయనున్నారు.