విలన్ డెన్‌లో టీ ఇచ్చే పాత్రకు కూడా పనికిరారు!

కాల్పులు జరిపిన షూటర్ల రూపురేఖలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2026-10-24 06:32 GMT

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాప్ పై కాల్పుల ఘటన ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఇప్ప‌టికే కాల్పుల‌కు తెగ‌బ‌డిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వినూత్న వ్యాఖ్యలతో నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచారు. కాల్పులు జరిపిన షూటర్ల రూపురేఖలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. అసలు నిజ జీవితంలోని నేరస్థులకు, సినిమాలలో చూపించే గ్యాంగ్‌స్టర్లకు మధ్య ఉన్న వైవిధ్యాన్ని తనదైన వ్యంగ్యాస్త్రాలతో విశ్లేషించారు.

`టైగర్ ష్రాఫ్ మీద కాల్పులు జరిపిన షూటర్ల తీరును.. వారి రూపురేఖలను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వీళ్ళని సినిమాలలో కనీసం విలన్ డెన్‌లో టీ ఇచ్చే చిన్నపాటి పాత్రలకు కూడా ఏ డైరెక్టర్ క్యాస్ట్ చేయరు` అంటూ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో తెరవెనుక ప్రపంచానికి.. బయటి నిజ జీవితానికి ఎంత పొంతన లేదో ఆర్జీవీ వ్యాఖ్యల ద్వారా ఎత్తి చూపడానికి ప్రయత్నించారు. సాధారణంగా తెరపై గ్యాంగ్‌స్టర్లు ..వారి అనుచరులు అంటే ప్రత్యేకమైన స్టైల్, భయపెట్టే లుక్స్ ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ నిజ జీవితంలో నేరాలకు పాల్పడే వారి ప్రొఫైల్స్ మాత్రం సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటాయని వ‌ర్మ పరోక్షంగా అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఆర్జీవీ పోస్ట్‌లో రియల్ లైఫ్ క్యాస్టింగ్ డైరెక్టర్ల తీరు విచిత్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. సినిమా రంగానికి చెందిన రీల్-లైఫ్ క్యాస్టింగ్ డైరెక్టర్లు ఒక పాత్ర కోసం నటులను ఎంపిక చేసేటప్పుడు ఎంతో ఆచితూచి వ్యవహరిస్తారని.. కానీ నిజ జీవితంలో నేర సామ్రాజ్యాన్ని నడిపించే లేదా దానికి పాల్పడే వ్యక్తుల ఎంపిక మాత్రం ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కాల్పుల ఘటన కేవలం డబ్బుకోసమో .. బ్లాక్ మెయిల్ కోసమో జరిగినట్లు లేదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా వానిటీ అండ్ ప్రైడ్ కోసమే జరిగిందని విశ్లేషించారు. ఇలాంటి విభిన్నమైన పరిణామాలు పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో.. నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. భద్రతా వైఫల్యం .. ప్రమాదకరమైన ఘటనను కూడా ఆర్జీవీ తనదైన సెటైరికల్ శైలిలో సినిమా పరిశ్రమలోని క్యాస్టింగ్ కోణంతో ముడిపెట్టి మాట్లాడటం ప‌రిశ్ర‌మ‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News