స్టార్ పవర్ ఉన్నా ఓటీటీలు భయపడుతున్నాయా?

ఆడియెన్స్ టేస్ట్ మారింది, ఓటీటీల స్ట్రాటజీ కూడా మారింది. ఫ్లాప్ సినిమాలను వందల కోట్లకు కొని, చేతులు కాల్చుకున్న తర్వాత.. ఇప్పుడు వాళ్లు స్టార్ పవర్ కంటే కంటెంట్ కే ఎక్కువ విలువిస్తున్నారు.;

Update: 2025-10-27 04:43 GMT

ఒకప్పుడు మన స్టార్ హీరోల సినిమా అనౌన్స్ చేస్తే చాలు.. థియేట్రికల్ రైట్స్ కన్నా ముందే ఓటీటీ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్లతో క్యూ కట్టేవాళ్లు. "సినిమా కాన్సెప్ట్ కాంబినేషన్ తో సంబంధం లేకుండా, అడ్వాన్స్ ఎంతో కొంత తీసుకోండి" అన్నట్లు ఉండేది సీన్. ప్రొడ్యూసర్లకు ఇది పెద్ద సేఫ్టీ నెట్. సినిమా రిలీజ్‌కు ముందే పెట్టుబడిలో 50% నుంచి 60% వెనక్కి వచ్చేసేది. కానీ, ఆ రోజులు పోయాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు చాలా మారిపోయాయి.

ఆడియెన్స్ టేస్ట్ మారింది, ఓటీటీల స్ట్రాటజీ కూడా మారింది. ఫ్లాప్ సినిమాలను వందల కోట్లకు కొని, చేతులు కాల్చుకున్న తర్వాత.. ఇప్పుడు వాళ్లు స్టార్ పవర్ కంటే కంటెంట్ కే ఎక్కువ విలువిస్తున్నారు. ముఖ్యంగా, వాళ్ల డేటా ఏం చెప్తోందో చూస్తున్నారు. ఈ స్టార్ సినిమాకు మేము ఇంత పెడితే, మాకు ఎంత మంది కొత్త సబ్‌స్క్రైబర్లు వస్తారు? అనేది వాళ్ల సింగిల్ పాయింట్ క్వశ్చన్. ఈ కొత్త లెక్కల దెబ్బ ఇప్పుడు ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్‌కు కూడా గట్టిగా తగులుతోంది.

2026 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పెద్ద సమరమే జరగనుంది. ఒకవైపు ప్రభాస్ 'రాజా సాబ్', మరోవైపు చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'.. ఈ రెండు సినిమాలపై అంచనాలు హైలెవెల్ లోనే ఉన్నాయి. థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. కానీ, ప్రొడ్యూసర్లకు అసలు కిక్ ఇచ్చే 'డిజిటల్ డీల్స్' మాత్రం ఇంకా తెగలేదు.

ఇక్కడే అసలు మైండ్ గేమ్ నడుస్తోంది. రాజా సాబ్ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ. సలార్, కల్కి లాంటి సినిమాలు హిట్ అయినా, ప్రభాస్ గత ఫ్లాపులు ఆదిపురుష్, రాధే శ్యామ్ ఎఫెక్ట్ ఓటీటీ మార్కెట్‌పై గట్టిగానే ఉంది. అందుకే, ప్రొడ్యూసర్ అడిగే భారీ రేటుకు, ఓటీటీలు ఆఫర్ చేసే రేటుకు పొంతన కుదరడం లేదు. మీరు అడిగే రేటుకు, ఆ సినిమా ఫ్లాప్ అయితే మా పరిస్థితి ఏంటి? అనేది ఓటీటీల భయం.

మరోవైపు చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో 'మన శంకర వర ప్రసాద్ గారు'. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఉన్నా, మేకర్స్ సంక్రాంతి రిలీజ్ అనే పాయింట్‌ను వాడుకుని, ఓటీటీ రైట్స్‌కు రికార్డ్ ప్రైస్ కోట్ చేస్తున్నారట. కానీ, ఓటీటీలు మాత్రం సంక్రాంతి సినిమాలు థియేటర్లలో ఆడతాయి. జనాలు ఓటీటీలో కూడా అదే బజ్ తో చూడరు.. మేం ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి? అని రివర్స్ లాజిక్ తీస్తున్నాయి.

అందుకే, ఈ రెండు డీల్స్ హోల్డ్‌లో ఉన్నాయి. ఇది కేవలం ఈ రెండు సినిమాల సమస్య కాదు, ఇండస్ట్రీలో మారిన ట్రెండ్‌కు ఇది పెద్ద ఉదాహరణ. ప్రొడ్యూసర్లు రిలీజ్‌కు ముందే అమ్మి సేఫ్ అవ్వాలని చూస్తున్నారు. చాలా వరకు ఓటీటీలు సినిమా కంటెంట్ పై నమ్మకం వచ్చాక డీల్స్ మాట్లాడుకోవలని చూస్తున్నాయి. లేదంటే రిలీజ్ తర్వాత టాక్ చూసి కొని సేఫ్ అవ్వాలని చూస్తున్నాయి. మరి ఈ గేమ్‌లో చివరికి ఎవరు నెగ్గుతారో చూడాలి. కానీ ఒకటి మాత్రం క్లియర్.. ఓటీటీల నుంచి ఈజీ మనీ వచ్చే రోజులు మాత్రం అయిపోయాయి.

Tags:    

Similar News