బాలీవుడ్ హీరోల్లా టాలీవుడ్ హీరోలు వీళ్లిద్ద‌రేనా?

బాలీవుడ్ హీరోలు పారితోషికానికి బ‌ధులు సినిమాల్లో వాటా తీసుకుంటారు. మంచి లాభాలు సాధిస్తే అందులో భారీ షేర్ ద‌క్కుతుంది.;

Update: 2025-06-06 02:30 GMT

బాలీవుడ్ హీరోలు పారితోషికానికి బ‌ధులు సినిమాల్లో వాటా తీసుకుంటారు. మంచి లాభాలు సాధిస్తే అందులో భారీ షేర్ ద‌క్కుతుంది. ముందొస్తుగా ఎలాంటి అడ్వాన్స్ తీసుకోకుండా మార్కెట్ లో త‌న ఇమేజ్ నే పెట్టుబ‌డిగా పెట్టి షేర్ తీసుకుంటాడు. దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇదే ప్రాతి ప‌దిక‌న సినిమాలు చేస్తారు. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, హృతిక్ రోష‌న్ ప్ర‌ధానంగా ఇందులో క‌నిపిస్తారు. వీలైనంత వ‌ర‌కూ వాళ్ల సొంత బ్యాన‌ర్లోల‌నే సినిమాలు ఉండేలా చూసుకుంటారు.

దీంతో అధిక మొత్తంలో లాభాలు అర్జిస్తుంటారు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఇంకా ఈ విధానం అమ‌లులో లేదు. తెలుగు హీరోలంతా భారీ మొత్తంలో పారితోషికం రూపంలోనే తీసుకుంటారు. అడ్వాన్స్ గా కొంత షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత బ్యాలెన్స్ తీసుకుని ప‌ని పూర్తి చేస్తారు. కొంత మంది హీరోలు సినిమా ప్లాప్ అయితే పారితోషికంలో కోత వేడ‌యం..లేదా మొత్తం తిరిగి చెల్లించ‌డం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి బాలీవుడ్ హీరోలు చేయ‌రు. ఇది టాలీవుడ్ లో మాత్ర క‌నిపిస్తుంది.

తాజాగా ఓ ఇద్ద‌రు తెలుగు హీరోలు మాత్రం షేర్ రూపంలో క‌మిట్ అవుతున్నారు. వాళ్లే ప్ర‌భాస్..బ‌న్నీ. `బాహుబ‌లి`తో ప్ర‌భాస్ పాన్ ఇండియాలో స్టార్ అయిన సంగ‌తి తెలిసిందే. `బాహుబ‌లి`కి పారితోషిక‌మే తీసుకున్నారు. కానీ ఆ త‌ర్వాత న‌టించిన సినిమాల‌న్నింటికి వ‌చ్చిన లాభాల్లో వాటా అందుకుం టున్నారు. నిర్మాణ సంస్థ‌ల‌తో ప్ర‌భాస్ ఆ ర‌కంగానే ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ స్టార్ కావ‌డంతో? ప్ర‌భాస్ కు భారీ మొత్తంలో షేర్ ద‌క్కుతుంది.

ఇక బన్నీ కూడా `పుష్ప` ప్రాంచైజీతో పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రానికి బ‌న్నీ కూడా షేర్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుంది. ఇందులో అల్లు అర‌వింద్ పెట్టుబ‌డి పెట్టాల‌ని చూసారు. కానీ స‌న్ సంస్థ అంగీకరించలేద‌. దీంతో బ‌న్నీ పారితోషికం కాకుండా త‌న మార్కెట్ ఆధారంగా షేర్ ఇవ్వాల‌ని అడిగాడు. ఆ కండీష‌న్ ప్ర‌కార‌మే సినిమా చేస్తున్న‌ట్లు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, మ‌హేష్ కూడా ఈ లిస్ట్ లో అతి త్వ‌ర‌లోనే చేర‌తారు.

Tags:    

Similar News