ప్రభాస్ @ 23 ఇయర్స్.. ఇంత స్టోరీ ఉందా?

ప్రభాస్.. చాలామంది కటౌట్ కాదు కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు.;

Update: 2025-11-11 11:13 GMT

ప్రభాస్.. చాలామంది కటౌట్ కాదు కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. కానీ ప్రభాస్ మాత్రం తన కంటెంట్ తో పాటూ కటౌట్ తో కూడా పాన్ ఇండియా బాక్సాఫీస్ ను శాసిస్తూ తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతున్నారు. అంతేకాదు నేడు ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా చెలామణి అవుతూ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హీరోగా రికార్డు సృష్టించారు. అయితే ఈ రికార్డ్స్ ని ఆయన సృష్టించగలడు అని 20 సంవత్సరాల క్రితమే పలువురు దర్శకులు గ్రహించి.. నటన పూర్తికాకముందే ఇండస్ట్రీలో అవకాశం కల్పించి ఆయనకు ఒక స్థానాన్ని కల్పించారు.




 


అలా ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. నేడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇకపోతే ఈశ్వర్ సినిమా విడుదలై 23 ఏళ్లు అయిన సందర్భంగా.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు.. అలాగే ప్రభాస్ క్రేజ్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

2002 నవంబర్ 11న ప్రభాస్ హీరోగా, జూనియర్ శ్రీదేవి హీరోయిన్ గా వచ్చిన చిత్రం ఈశ్వర్. అప్పట్లోనే 2 కోట్లు కలెక్షన్స్ వసూల్ చేసింది ఈ సినిమా. ఇకపోతే నటనలో శిక్షణ పూర్తి కాకుండానే ప్రభాస్ ఈ సినిమా చేయాల్సి వచ్చిందట. అలా ఈ మూవీ ఎలా మొదలైంది? అనే విషయాన్ని డైరెక్టర్ జయంత్ సి పరాంజి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. డైరెక్టర్ జయంత్ సి పరాంజి మాట్లాడుతూ.. " 2001లో నేను నిర్మాత అశోక్ కుమార్ కి సినిమా చేసి పెడతానని మాటిచ్చాను. అయితే నా సినిమాలో ప్రేమ కథలతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా జోడించాలని అనుకుంటాను. అలా వచ్చిన ఆలోచన ఈశ్వర్. తక్కువ బడ్జెట్ తో తీయాలని నేను, అశోక్ అనుకున్నాము

అయితే ఈ కథకు మాస్ లుక్ లో ఉండే ఒక కొత్త హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. కృష్ణంరాజు గారి తమ్ముడి కొడుకు ప్రభాస్.. సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు ఇతరుల ద్వారా తెలిసింది. వెంటనే ఆయనను పిలిపించి సినిమా చేద్దామని చెప్పాను. అయితే ఆ రోజే అతడిని కలిసినప్పుడు ఇతడు పక్కా హీరో మెటీరియల్ సూపర్ స్టార్ అవుతారని అనుకున్నాను. హీరో మెటీరియల్ అని ఫిక్స్ అయిన తర్వాత సినిమా చేద్దామని చెబితే.. ప్రభాస్ మాత్రం నటనలో శిక్షణ పూర్తి కాలేదు. ఇప్పుడే చేయను అని చెప్పాడు. నీకు శిక్షణ అవసరం లేదు అని చెప్పి స్టోరీ లైన్ చెప్పగానే ఓకే చెప్పాడు.. అలా ఈశ్వర్ సినిమా మొదలయ్యింది. ఇక ప్రభాస్ సినీ కెరియర్ కూడా ప్రారంభమైంది" అంటూ డైరెక్టర్ తెలిపారు. ఇక అలా అప్పట్లోనే ఆయన కటౌట్ చూసి స్టార్ హీరో అవుతారని నమ్మిన దర్శకుడు.. ఆయన నమ్మినట్టుగానే నేడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు.

Tags:    

Similar News