అఖండ 2 వివాదం.. మధ్యలో వేణు స్వామీ?
జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్, టీవీ ఛానెల్స్ లో పంచాంగం, జాతకాలు చెప్పుకుంటూ కాస్త ఫేమస్ అయ్యారు.;
జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్, టీవీ ఛానెల్స్ లో పంచాంగం, జాతకాలు చెప్పుకుంటూ కాస్త ఫేమస్ అయ్యారు. ఇంతలో కొందరు సెలబ్రిటీల విషయంలో ఆయన జోస్యం నిజమవ్వడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. దీంతో ఆయనకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అనేక మంది సెలబ్రిటీలు వేణు స్వామిని సంప్రదించారని టాక్ వచ్చింది.
అయితే అక్కడికి కొద్ది రోజులకే సీన్ రివర్స్ అయింది. ఆయన ఏం చెబుతున్నా దానికి రివర్స్ జరుగుతోంది. జోస్యం ఫలించడం లేదు. దీంతో దారుణమైన ట్రోలింగ్ బారిన పడ్డారు. అనేక మంది తీవ్రంగా విమర్శించారు. ఓ విషయంలో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తాను ఇకపై రాజకీయ, వ్యక్తిగత జాతకాలు జోలికి వెళ్లనని వేణుస్వామి స్పష్టం చేశారు.
రీసెంట్ గా ఆయన హోమం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బగళాముఖీ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు హోమం నిర్వహించానని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఓ పెద్ద సినిమా విజయం సాధించాలని బగళాముఖీ అమ్మవారికి హోమం నిర్వహించానని తెలిపారు. కానీ సినిమా పేరు మాత్రం చెప్పలేదు.
అయితే హోమం చేసిన సమయానికి పెద్ద మూవీ అంటే అఖండ 2: తాండవం సినిమానే. దీంతో వేణు స్వామి చేసిన హోమం అఖండ 2 గురించే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అఖండ 2 భారీ విజయం సాధించడం పక్కన పెడితే.. ప్రేక్షకుల ముందుకు రాలేదు. ముందు ప్రీమియర్స్ వేయడం లేదని ప్రకటించిన మేకర్స్.. ఆ తర్వాత విడుదల వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
దీంతో బాలయ్య ఫ్యాన్స్.. ఇప్పుడు వేణు స్వామిపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరో కెరీర్ లోనే ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వేణు స్వామి హోమం చేశారు.. మూవీ వాయిదా పడిందంటూ ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో మరో విషయం కూడా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
బగళాముఖీ వంటి శక్తివంతమైన దేవతల ఆరాధనను చాలా నిష్టగా చేయాలని, ఏమైనా తప్పుగా నిర్వహిస్తే మాత్రం ప్రతికూల ఫలితాలు వస్తాయని కొందరు చెబుతున్నారు. నిర్మాతలు చెప్తే చేశారో.. లేక ఆయన ప్రచారం కోసం హోమం చేశారో తెలియదు కదా అని అంటున్నారు. కానీ నిర్మాణ సంస్థ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడం వల్ల అఖండ-2 మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే.