ట్రోల్స్: మంత్రి అయినా హీరోగానే యాక్టింగ్
ఉదయనిధి స్టాలిన్ సినిమాల విషయానికి వస్తే 2008లో అతడు తన ప్రొడక్షన్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలను నిర్మిస్తూ వచ్చాడు.;
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన కోలీవుడ్ లో చాలా సినిమాలు చేశాడు, అలాగే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హీరోగా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ లను సొంతం చేసుకుని, నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోనూ నటిస్తున్నాడు అని, సినిమాల్లో మాదిరిగానే రాజకీయాలను చూస్తున్నాడు అంటూ మొదటి నుండి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఉదయనిధి స్టాలిన్ దొరికిపోయాడు. సాధారణంగా రాజకీయ నాయకులు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేసినా చేయకున్నా ఏదో చేస్తున్నట్లుగా హడావుడి క్రియేట్ చేస్తారు ఫోటోలకు ఫోజులు ఇస్తారు, రోడ్లపై చెత్త వేరే వేరుతున్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చి మీడియాలో కవరేజ్ చేయించుకోవడం అలవాటుగా వస్తుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు...
గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఫోటోలకు ఫోజులు ఇస్తామంటే కుదరదు. ఒకవేళ ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్తే తర్వాత రోజు విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేయడం పరిపాటయింది. వరుసగా రాజకీయ నాయకులు ఈ ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కంప్యూటర్ ల్యాబ్ ని సందర్శించాడు. ఆ సమయంలో పెద్ద ఎత్తున మీడియా వారు ఆయనను కవరేజ్ చేస్తున్నారు. అయితే కంప్యూటర్ ఆన్ చేయకుండా ఏదో సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు తెగ నటించేశాడు అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. కంప్యూటర్ ఆన్ చేయకుండా గతంలో వర్క్ చేస్తున్నట్లు ఏదో ఆపరేట్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఉదయనిధి స్టాలిన్ హీరో కనుక ఆయన ఇక్కడ కూడా బాగా యాక్టింగ్ చేస్తున్నాడు అంటూ ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. సాధారణంగానే సెలబ్రిటీలు చిన్న తప్పు చేస్తే సోషల్ మీడియాలో ఏకిపారేస్తారు. అలాంటిది స్టాలిన్ తనయుడు ప్రస్తుతం మంత్రి అయినా ఉదయనిది స్టాలిన్ దొరికితే ట్రోల్స్ చేసే వాళ్ళు ఊరికే ఉంటారా... తెగ రోస్ట్ చేసేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ అనేది క్లారిటీ లేదు, కానీ ఉదయనిధి పరువు తీసి పడేసింది అంటూ ఆయన అభిమానులే స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు ఆ వీడియోను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దావానంగా వైరల్ అవుతున్న ఆ వీడియోను తొలగించడం అంతా సులభమైన పని కాదని వారికి తెలుసు. అయినా కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. స్టాలిన్ ఒకవైపు తన రాజకీయ వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ ను ముందు నిలుపుతుంటే ఆయన మాత్రం ఇలా అడ్డంగా దొరికిపోతున్నారంటూ అధికార పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు సీఎం అనుకున్న ఉదయనిధి ఇలా తెలివి తక్కువగా దొరికిపోయాడు ఏంటి అని కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పాటు తెగ ట్రోల్స్ కి గురి అవుతున్నాడు.
సోషల్ మీడియాలో ఉదయనిధి వీడియో..
ఉదయనిధి స్టాలిన్ సినిమాల విషయానికి వస్తే 2008లో అతడు తన ప్రొడక్షన్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలను నిర్మిస్తూ వచ్చాడు. అతను హీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో అడుగుపెట్టాడు. తన తండ్రి స్టాలిన్ కి బాసటగా నిలుస్తూ, గత ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే ఉదయనిధి స్టాలిన్ కి మంత్రి పదవి దక్కింది. మంత్రి అయిన తర్వాత కూడా ఉదయనిధి పలు సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు అనేది టాక్ . డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ భవిష్యత్తులో మళ్లీ హీరోగా నటిస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నటుడిగా ఎంతైనా నటించొచ్చు... కానీ రాజకీయ నాయకుడిగా నటిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తాజా సంఘటనతో ఉదయనిధి స్టాలిన్ కి తెలిసి వచ్చి ఉంటుంది.