అఖండ-2 వాయిదా.. వాళ్ళకి ఈ సినిమా కి సంబంధం లేదు!

విచారణ జరిపిన హైకోర్టు, సినిమా రిలీజ్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం చెల్లించాకే సొమ్ము విడుదల చేయాలని ఆదేశించింది.;

Update: 2025-12-05 10:50 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2: తాండవం మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. నేడే రిలీజ్ కావాల్సిన ఆ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

అయితే అఖండ-2 ఎందుకు వాయిదా పడిందో మేకర్స్ చెప్పకపోయినా.. దాదాపు అది తెలిసిన విషయమే. ఎందుకంటే అఖండ 2 నిర్మాణ సంస్థ తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని, వడ్డీతో సహా ఆ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు మూవీ విడుదలను నిలిపివేయాలని బాలీవుడ్ బ్యానర్ ఈరోస్ ఎంటర్టైన్మెంట్స్ మద్రాసు హైకోర్టుకు ఎక్కింది.

విచారణ జరిపిన హైకోర్టు, సినిమా రిలీజ్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం చెల్లించాకే సొమ్ము విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో మూవీ విడుదల వాయిదా పడింది. కానీ కొందరు బాలయ్య అభిమానులు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుపై సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

వారిద్దరి వల్ల తమ అభిమాన హీరో మూవీ వాయిదా పడిందని ఆరోపిస్తున్నారు. నిన్న ఓ థియేటర్ వద్ద ఒక ఫ్యాన్ అలా చెప్పడం వల్ల.. అభిమానులంతా అదే నమ్మేసి చిరు, దిల్ రాజుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అఖండ పోస్ట్ పోన్ కు చిరు, దిల్ రాజుకు పూర్తిగా సంబంధమే లేదు.

అది తెలుసుకోకుండా ఎవరో ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ ను తీసుకుని.. చిరంజీవి, దిల్ రాజుపై విమర్శలు చేయడం అస్సలు కరెక్ట్ కాదని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే వారిని తిడుతున్న వారంతా నిజం తెలుసుకోవాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు.

అయితే ఇప్పుడు అఖండ మేకర్స్.. విడుదల వాయిదా పడడానికి కారణమైన సమస్యలను పరిష్కరించుకోవడంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈరోస్ సంస్థతో చర్చలు జరిపారని సమాచారం. శరవేగంగా పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు వినికిడి. హైకోర్టు జోక్యం ఉండడంతో వెంటనే క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారట. మరి ఇష్యూ ఎప్పుడు క్లియర్ అవుతుందో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.


Tags:    

Similar News