అవార్డ్స్ ఫంక్షన్ లో రకుల్.. ట్రెండీ లుక్ లో దర్శనమిస్తూ..
రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు, తమిళ, కన్నడ,హిందీ భాషల్లో పేరున్న హీరోయిన్.. పాకెట్ మనీ కోసం సినిమాల్లోకి వచ్చి అదే తన వృత్తిగా మార్చుకుంది..;
రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు, తమిళ, కన్నడ,హిందీ భాషల్లో పేరున్న హీరోయిన్.. పాకెట్ మనీ కోసం సినిమాల్లోకి వచ్చి అదే తన వృత్తిగా మార్చుకుంది.. అలా 2009లో వచ్చిన కన్నడ గిల్లి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో అనిత అనే పాత్రలో మెరిసింది.ఆ తర్వాత కెరటం అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో తన అందంతో అందరిని అట్రాక్ట్ చేసింది.
తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన డ్రెస్సింగ్ స్టైల్ తో అక్కడున్నవారిని కట్టిపడేసింది..
ఫుల్ లెన్త్ ఫ్రాక్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఓ అవార్డు అందుకోవడం కోసం వెళ్ళినట్టు అర్థమవుతుంది. అంతేకాదు ఈ అవార్డ్స్ ఫంక్షన్లో రకుల్ ప్రీత్ సింగ్ అవార్డు అందుకున్న ఫోటో కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. విషయంలోకి వెళ్తే.. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్.. అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన దేదే ప్యార్ దే -2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆయేషా అనే పాత్రలో రకుల్ నటించింది.అయితే ఈ సినిమాలో నటించినందుకు గానూ తనకు మొట్టమొదటి అవార్డు వచ్చిందని రకుల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. అవార్డ్ ఫంక్షన్ కి వెళ్లిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా దేదే ప్యార్ దే -2 సినిమాలోని ఆయేషాకి మొదటి అవార్డు వచ్చింది. ప్రధాన పాత్రలో ఈ సంవత్సరం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు.. ఈ అవార్డు వచ్చిందని థాంక్స్ చెప్తూ లవ్ సింబల్ ని పెట్టి క్యాప్షన్ లో రాసుకువచ్చింది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ అందానికి ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే అంటూ ఫోటోలు చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు రకుల్ అందానికి ఫైర్ ఎమోజీలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. రకుల్ వేసుకున్న ఆ డ్రెస్ డిజైన్ అద్భుతంగా ఉండడంతో చాలామందికి ఆ డ్రెస్ తెగ నచ్చేసింది.. దీంతో ఈమె డ్రెస్సింగ్ స్టైల్ పై కూడా కామెంట్లు చేస్తున్నారు..
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ కి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా హిట్ ఇచ్చింది.ఈ సినిమా తర్వాత రకుల్ కెరియర్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఎటు చూసినా సరే వరుస హిట్స్ పడిపోయాయి. అలా తెలుగు , తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. కానీ ఆ తర్వాత ఈ హీరోయిన్ చేసిన సినిమాలు ఒక్కొక్కటిగా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. దాంతో సౌత్ ఇండస్ట్రీలో పూర్తిగా అవకాశాలు కరువయ్యాయి. అంతేకాకుండా ఎప్పుడైతే నటుడు,నిర్మాత అయినటువంటి జాకీ భగ్నాని ని పెళ్లాడిందో అప్పటినుండి రకుల్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం అయిపోయింది. అలా హిందీలో పలు సినిమాలు చేస్తూ రాణిస్తోంది. ఈ మధ్యనే దే దే ప్యార్ దే -2అనే మూవీతో మనల్ని అలరించింది. త్వరలోనే ఈ హీరోయిన్ కొత్త సినిమాలతో కూడా మన ముందుకు రాబోతుంది.ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఇండియన్ 3 సినిమా ఉంది.