ప్లాప్ సినిమాను వెన‌కేసుకొచ్చిన‌ రివాల్వ‌ర్ బ్యూటీ!

ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. ప్లాప్ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతుందేంటి? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.;

Update: 2025-12-05 11:30 GMT

`ద‌స‌రా` త‌ర్వాత కీర్తి సురేష్ కి విజ‌యం అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. `ద‌స‌రా` అనంత‌రం ఏడు సినిమాల్లో న‌టించింది. వాటిలో ఒక‌టి రెండు చిత్రాలు త‌ప్ప మిగిలిన సినిమాల‌న్నీ ప్లాప్ అయిన‌వే. `మామ‌న్న‌న్`, `క‌ల్కి` లాంటి చిత్రాలే విజ‌యాలుగా క‌నిపిస్తున్నాయి. `భోళాశంక‌ర్`,` సిరెన్`, `ర‌ఘుతాత‌`,`బేబీ జాన్`, `ఉప్పుక‌ప్పు రంబు` అన్నీ ప్లాప్ అయిన చిత్రాలే. తాజాగా రిలీజ్ అయిన `రివాల్వ‌ర్ రీటా` కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఈ సినిమాపై అమ్మ‌డు చాలా ఆశ‌లు పెట్టుకుంది. కానీ వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. క్రైమ్ కామెడీ చిత్రంగా రిలీజ్ అయిన సినిమా చూసి జ‌నాలు పెద‌వి విరిచేసారు.

న‌టి వ్య‌క్తిత్వానికి ద‌గ్గ‌ర‌గా ఆ రోల్:

రొటీన్ సినిమాతో విసుగు పుట్టించింద‌నే విమ‌ర్శ‌ల‌కు గురైంది. అయితే ఈ సినిమాలో న‌వ్వించ‌డానికి తానెంతో క‌ష్ట ప‌డిన‌ట్లు కీర్తి తెలిపింది. ఇలాంటి పాత్ర‌లు పోషిచ‌డం ఆషామాషీ కాద‌ని..కామెడీ అనేది క‌ఠిన‌మైన భావోద్వేగంగా పేర్కొంది. సినిమాలో ఆ పాత్ర త‌న వ్య‌క్తిత్వానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని తెలిపింది. ప‌ని ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు ఇలాంటి సినిమా త‌న‌కు రీప్రెష్ మెంట్ గా ఉంటుందంది. డైలాగులను బ‌ట్టి ప‌ట్ట‌డం..ప‌దిసార్లు రిహార్స ల్స్ చేసి న‌టించే సినిమా కాద‌ని... అనుకోకుండా స‌హ‌జంగా పండిచాల్సిన కామెడీ రోల్ అని తెలిపింది.

మ‌హాన‌టి ఇమేజ్ తో:

ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. ప్లాప్ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుతుందేంటి? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌రుస ప్లాప్ ల్లో ఉన్న కీర్తి సురేష్ త‌న‌ని తాను ఈ ర‌కంగా డిపెండ్ చేసుకుం టుందా? అంటున్నారు. రివాల్వ‌ర్ రీటాకు వ‌చ్చిన రివ్యూల‌ను గుర్తు చేస్తున్నారు. మ‌రికొంత మంది కీర్తి సురేష్ ఇక‌పై లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేయ‌డం మానేస్తే మంచిద‌ని సూచిస్తున్నారు. `మ‌హాన‌టి` తో కీర్తి సురేష్ కు తెలుగింట న‌టిగా ఎలాంటి గుర్తింపు ద‌క్కిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

మ‌రో హిందీ సినిమా పై అప్ డేట్ లేదే:

ఆనాటి సావిత్రినే వెండి తెర‌పై చూస్తున్న‌ట్లు ఉంద‌ని ఎంతో మంది పాత త‌రం అభిమానులు కీర్తిని ఉద్దేశించి మాట్లాడేవారు. ప్ర‌త్యేకంగా కీర్తి సురేష్ ని క‌లిసి మాట్లాడ‌టానికి ఎంతో మంది ప్ర‌య‌త్నించారు. కొంత మంది కీర్తి సురేష్ తో ఆన్ లైన్ లో మాట్లాడ‌టం జ‌రిగింది. అలాంటి అభిమానుల నుంచి అమ్మ‌డు నేడు నెగిటివిటీనే ఎదుర్కుంటుంది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ త‌మిళ్ లో `క‌న్నైవేడి` అనే చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతానికి చేతిలో ఉంది ఈ ఒక్క చిత్ర‌మే. బాలీవుడ్ లో `బేబీజాన్` తో లాంచ్ అయిన త‌ర్వాత మ‌రో ఛాన్స్ అందుకుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది గానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.

Tags:    

Similar News