సెట్ అయితే సంచలనమే కానీ? వెంట కొన్ని సందేహాలు!
కోలీవుడ్ స్టార్ సూర్య తొలి పాన్ ఇండియా చిత్రం `కంగువ` ఎంతగా నిరుత్సాహ పరిచిందో చెప్పాల్సిన పనిలేదు. సూర్య కెరీర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా చిత్రమిది.;
కోలీవుడ్ స్టార్ సూర్య తొలి పాన్ ఇండియా చిత్రం `కంగువ` ఎంతగా నిరుత్సాహ పరిచిందో చెప్పాల్సిన పనిలేదు. సూర్య కెరీర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా చిత్రమిది. పీరియాడిక్ చిత్రంగా ప్రేక్షకుల ముందు కొచ్చిన సినిమా అంచనాలు పూర్తిగా తారు మారు చేసింది. సూర్య కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నమోదైంది. సూర్య ఇలాంటి సినిమా చేసాడేంటి? అనిపించే స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సూర్య కొన్నాళ్ల పాటు రీజనల్ గానే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ఆ క్రమంలో సూర్య ప్రయాణం కొనసాగుతోందిప్పుడు.
ప్రీ ప్రొడక్షన్ మొదలైందా:
తమిళ దర్శకుడు బాలాజీతో ఓ సినిమా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ చిత్రం చేస్తున్నాడు. రెండు రీజనల్ సినిమాలే. సరిగ్గా ఇదే సమయంలో శంకర్ `వేల్పరి` ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా సూర్యని అనుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అతడితో పాటు విక్రమ్, కార్తీ సహా పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఆ కథలో హీరో ఎవరు? అన్నది తేలడానికి సమయం పడు తుంది. ప్రస్తుతం శంకర్ మాత్రం `వేల్పరి` పనుల్లోనే నిమగ్నమయ్యారు. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగానే జరుగుతున్నాయి.
హిట్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ కే:
ఒకవేళ సూర్య గనుక హీరోగా ఎంపికైతే? ఆ కాంబినేషన్ లో సినిమా చూడాలి అన్నది అభిమానుల కలగాను చెప్పొచ్చు. శంకర్ లాంటి డైరెక్టర్ కి సూర్య లాంటి నటుడు తోడైతే వేరే లెవల్లో ఉంటుంది. ఇంత వరకూ ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాలేదు. శంకర్ పని చేసిన స్టార్లతోనే పదే పదే పనిచేసారు తప్ప! సూర్య లాంటి నటుడ్ని టచ్ చేయలేదు. ఇప్పటికైనా ఆ ఛాన్స్ తీసుకోవడం నిజమైతే ప్రాజెక్ట్ పై బజ్ హైలోనే ఉంటుంది. సూర్యకి కూడా పాన్ ఇండియాలో రీచ్ అవ్వడానికి మంచి ఛాన్సుగానూ చెప్పొచ్చు. శంకర్ సినిమాలు కనెక్ట్ అయ్యాయి? అంటే అంతర్జాతీయ మార్కెట్ కి కూడా రీచ్ అవుతుంది. ఇదంతా పాజిటివ్ వెర్షన్.
రెండు చరిత్రలే:
కానీ శంకర్ కొంత కాలంగా వరుస వైఫల్యాలు ఎదుర్కుంటున్నారు. ఆయన టేకప్ చేసిన ప్రాజెక్ట్ లు ఏవీ సక్సెస్ అవ్వడం లేదు. గత రెండు సినిమాలు `ఇండియాన్ -2`, `గేమ్ ఛేంజర్` ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో శంకర్ బ్రాండ్ ఇమేజ్ పై కొంత ప్రతికూలత ఏర్పడింది. దాన్ని దాటుకుని శంకర్ సినిమా చేయాల్సి ఉంది. `వేల్పరి` కూడా చారిత్రాత్మక నేపథ్యం గల కథగా తెలుస్తోంది. సూర్య నటించిన `కంగువ` కు కూడా కొంత చరిత్ర ఉంది. దాని ఆధారంగానే డైరెక్టర్ శివ తెరకెక్కించాడు. మరి `కంగువ` ప్లాప్ ను వేల్పరి విషయంలో ఎలా తీసుకుంటాడు? అన్నది ఆసక్తికరమే.