చరణ్ తో సుకుమార్ స్టైలిష్ చిత్రమా?
ఈ సినిమా షూటింగ్ కూడా విదేశాల్లో ఎక్కువగా జరుగుతుందని..దీనిలో భాగంగా ఆస్ట్రేలియాలో మేజర్ పార్ట్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారుట.;
ఆర్సీ 17 సుకుమార్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. `రంగస్థలం` తర్వాత సుకుమార్ మరోసారి చరణ్ తో ముందుకెళ్తున్నాడు. `రంగస్థలం` బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి కథాంశంతో ముంద కెళ్తున్నారు? అన్న దానిపై చాలా సందేహాలున్నాయి. కానీ బలంగా వినిపిస్తోన్న మాట మాత్రం రంగస్థలానికి సీక్వెల్ అనే ప్రచారం తొలి నుంచి జరుగుతోంది. `రంగస్థలం` ప్రీక్వెల్ లేదా? సీక్వెల్ అవ్వొచ్చు అన్నది ఫిలిం సర్కిల్స్ లో సైతం జరుగుతోన్న డిస్కషన్. సుకుమార్ గత సినిమా `పుష్ప కూడా రా అండ్ రగ్గడ్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా కి యనెక్ట్ అవ్వడంతో? అదే తరహాలోనే ఆర్సీ 17 ఉంటుందని మెగా అభిమానుల్లోనూ డిస్కషన్ జరుగుతోంది.
కానీ అసలు సంగతి ఇదీ అంటూ మరో కొత్త వార్త తెరపైకి వచ్చింది. సుకుమార్ ఈ చిత్రాన్ని ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తోనే స్క్రిప్ట్ సిద్దం చేసాడని వినిపిస్తోంది. గ్లోబల్ స్థాయిలో చరణ్ కు ఉన్న ఇమేజ్ ను బేస్ చేసుకుని కథలో చాలా మార్పులు చేసాడుట. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కించాలన్నది సుకుమార్ ప్లాన్ గా లీకైంది. హాలీవుడ్ రేంజ్ లో సుకుమార్ ప్లానింగ్ ఉందని ఆయన సన్నిహితుల నుంచి తెలిసింది. లెక్కలు మాష్టారు ఓ యూనిక్ పాయింట్ తో స్టైలిష్ గా కథని మలిచారుట. చరణ్ రోల్ చాలా స్టైలిష్ గా కొత్తగా ఉంటుందిట.
ఈ సినిమా షూటింగ్ కూడా విదేశాల్లో ఎక్కువగా జరుగుతుందని..దీనిలో భాగంగా ఆస్ట్రేలియాలో మేజర్ పార్ట్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారుట. ఈ కథకు ఎలాంటి పీరియాడిక్ టచప్ ఉండదంటున్నారు. మొత్తానికి ఈ ప్రచారంలో నిజమెంతో గానీ సుకుమార్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్లోనే కనిపిస్తోంది. ప్రధానంగా చరణ్ గ్లోబల్ ఇమేజ్ ని బేస్ చేసుకుని రాస్తోన్న కథగా తెలుస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` సినిమా తర్వాత రామ్ చరణ్ కు హాలీవుడ్ డైరెక్టర్లు సినిమా ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. కానీ చరణ్ మాత్రం సున్నితంగా వాటిని తిరస్కరించాడు. తానేం చేసినా మాతృభాష నుంచే అంటూ వెనక్కి తగ్గాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు `పెద్ది` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ ముగింపుకల్లా క్లైమాక్స్ కు చేరుతుంది. అటుసై పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 27న పాన్ ఇండియాలో రిలీజ్ చేయనున్నారు. అనంతరం సుకుమార్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.