• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బుట్ట‌బొమ్మ‌లో కొత్త...

బుట్ట‌బొమ్మ‌లో కొత్త సంవ‌త్స‌రం వైబ్స్

| తాజాగా ఇన్ స్టా వేదిక‌గా పూజా షేర్ చేసిన అంద‌మైన ఫోటోలు ఇంటర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. పూజా సొగసైన తెల్లటి లెహెంగాలో తన అద్భుతమైన అందాన్ని ప్రదర్శించింది.

By - Tupaki Desk
Update: 2024-01-10 03:57 GMT

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవ‌ల హిందీ పరిశ్ర‌మ‌లో మాత్ర‌మే న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో రెండు భారీ చిత్రాల్లో అవ‌కాశాల్ని కోల్పోయిన ఈ బ్యూటీ త‌దుప‌రి సినిమాల ఎంపిక‌లో ఎందుక‌నో రేసులో వెన‌క‌బ‌డుతోంది. అయితే దక్షిణాది అభిమానుల నుంచి కొంత దూర‌మైనా కానీ సోష‌ల్ మీడియాల్లో మాత్రం అంద‌రికీ ట‌చ్ లోనే ఉంది.


తాజాగా ఇన్ స్టా వేదిక‌గా పూజా షేర్ చేసిన అంద‌మైన ఫోటోలు ఇంటర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. పూజా సొగసైన తెల్లటి లెహెంగాలో తన అద్భుతమైన అందాన్ని ప్రదర్శించింది. అంత‌గా మేక‌ప్ తో ప‌ని లేకుండా ఎంతో సింపుల్ గా క‌నిపించిన పూజా స్మైలీ ఫేస్ తో మైమ‌రిపించింది. ఈ ఫొటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఉత్సాహం నెలకొంది. నెటిజ‌నులు బుట్ట‌బొమ్మ‌ అందాన్ని ఎంత‌గా ఆరాధిస్తున్నారో ఇప్పుడు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.


పూజా తన గ్లామ్ కోటియన్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? అని త్రోబ్యాక్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నిస్తే... త‌న‌దైన శైలిలో ఆత్మ‌విశ్వాసాన్ని వ్య‌క్తం చేసింది పూజా. సినిమాలో కేవలం అలంకరణగా మాత్ర‌మే మారవద్దు అని పూజా చెప్పింది. ఆత్మ‌విశ్వాసం అనేది అంత‌ర్భాగం నుంచి రావాల‌ని అంది.


ఇదే ఇంట‌ర్వ్యూలో బుట్ట బొమ్మ ట్యాగ్ గురించి కూడా పూజా ప్ర‌స్థావించింది. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో'లోని ఒక ఉదాహరణను ఉటంకిస్తూ "ఇది అంతర్గత ఆత్మవిశ్వాసం నుండి వచ్చిందని నేను అనుకుంటున్నాను .. ప్రజలు బుట్ట బొమ్మ గురించి అన్నిటికంటే ఎక్కువగా మాట్లాడుకున్నారు. కానీ అక్కడ నేను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించిన కొన్ని సన్నివేశాలు కథలో నా పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలియజేస్తుంది" అని వ్యాఖ్యానించింది.


అలాగే నేను చాలా దూరం వెళ్లి భాష కష్టంగా ఉన్నప్పటికీ నా సినిమాలకు డబ్బింగ్ చేస్తాను. ఇప్పుడు కాక‌పోయినా తరువాత అయినా ప్రజలు నన్ను నా ప్రయత్నాలను గుర్తిస్తారనేది నా ఉద్ధేశం. రాధే శ్యామ్ కోసం ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి ప్ర‌శ్నించ‌గా.. పూజా మాట్లాడుతూ-"ప్రభాస్ చాలా గుంబ‌న‌గా ఉండే వ్యక్తి. మొదట అతడు చాలా సిగ్గుపడేవాడు. నేను అతడితో ఉన్న‌ సమయాన్ని ఆస్వాధించాను. త‌న‌తో కలిసి నటించడం చాలా సౌకర్యంగా అనిపించింది. సినిమాలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది" అని తెలిపింది.


Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Socialmedia 
  • Phototalk 
  • Gorgeouslooks 
  • Poojahegde 
  • Actresspooja 
  • Movieoffers 
  • Photoshoot 
  • Lehengalooks 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS