బుట్ట‌బొమ్మ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందే!

చేతిలో ఉన్న ఒకే ఒక్క హిందీ సినిమా అది. దీంతో లాభం లేద‌నుకున్న అమ్మ‌డు మ‌ళ్లీ సౌత్ అవ‌కాశాల కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-17 08:15 GMT

సౌత్ లో మ‌ళ్లీ బుట్ట‌బొమ్మ పుంజుకుంటుందా? కొత్త అవ‌కాశాల‌తో అమ్మ‌డు అభిమానుల్లో జోష్ నింపుతుందా? అంటే స‌న్నివేశంగా అలాగే క‌నిపిస్తుంది. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో అమ్మ‌డు ఒక్క‌సారిగా బాలీవుడ్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కానీ న‌టించిన సినిమాలేవి ఆశించ‌న ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో అక్క‌డ సీన్ రివ‌ర్స్ అయింది. వ‌రుస వైఫ‌ల్యాల నేప‌థ్యంలో అవ‌కాశాలు లేకుండా పోయాయి. చివ‌రికి `దేవా` అనే చిత్రంలో ఛాన్స్ అందుకుంది.

చేతిలో ఉన్న ఒకే ఒక్క హిందీ సినిమా అది. దీంతో లాభం లేద‌నుకున్న అమ్మ‌డు మ‌ళ్లీ సౌత్ అవ‌కాశాల కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. చేయ‌గా చేయ‌గా చివ‌రికి మ‌ళ్లీ యువ సామ్రాట్ నాగ చైత‌న్య కొత్త ప్రాజెక్ట్ లో న‌టించే ఛాన్స్ అందుకుంది. అప్ప‌టికే మ‌రో తెలుగు సినిమాకి సైన్ చేసిన అనివార్య కార‌ణాల‌తో అది ఆగిపోయింది. ఆవెంట‌నే చైత‌న్య సినిమా లో లాక్ అవ్వ‌డం జ‌రిగింది. దీంతో పూజాహెగ్డేలో మ‌ళ్లీ చిన్న హోప్ మొద‌లైంది.

Read more!

ఈసారి మాత్రం సౌత్ ఇండస్ట్రీని సీరియ‌స్ గానే తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. మునుప‌టి లా అశ్ర‌ద్ద చేయ‌కుండా శ్ర‌ద్ద‌గా ప‌నిచేసేలా ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య 44వ చిత్రంలోనూ బుట్ట‌బొమ్మ ఎంపికైంది అన్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు భామ‌ల్ని ప‌రిశీలించినా ఆ పాత్రకి పూజా అయితే స‌రిపోతుంద‌ని ఆమెని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

సూర్య‌తో పూజా బ్యూటీ ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. విజ‌య్ స‌హా కొంత మంది స్టార్ల‌తో ప‌నిచేసింది. కానీ ఆ సినిమాలేవి అక్క‌డ పెద్ద‌గా గుర్తింపు తీసుకురాలేదు. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ లో మ‌ళ్లీ ఛాన్స్ క‌ష్ట‌మే అనుకున్న స‌మ‌యంలో కార్తీక్ పిలిచి అవ‌కాశం ఇచ్చాడు. జూన్ 2 నుంచి అండమాన్ దీవులలో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఊటీ , తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో 40 రోజుల పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ ఇది.

Tags:    

Similar News