• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరో.. ఈ హీరోయిన్.....

ఆ హీరో.. ఈ హీరోయిన్.. కాంబో ఫిక్స్ అయితే సూపర్..!

| సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

By - Tupaki Desk
Update: 2024-05-06 13:30 GMT

సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు హీరో, హీరోయిన్ కాంబో కూడా ఆడియన్స్ లో సూపర్ బజ్ ఏర్పడేలా చేస్తుంది. ఫలానా హీరో ఫలానా హీరోయిన్ తో జత కడితే చూడాలని ప్రేక్షకులు కోరుతుంటారు. ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ జోడీలు ఆడియన్స్ ని అలరించాయి. అయితే కొన్నిసార్లు అసలు ఒక్కసారి కూడా కలిసి పనిచేయని కొన్ని కాంబినేషన్స్ మీద కూడా అంచనాలు ఉంటాయి. అలాంటి ఒక స్టార్ హీరో.. స్టార్ హీరోయిన్ జోడీ ప్రస్తుతం చర్చల దశలో ఉంది.

ఇంతకీ ఎవరా హీరో.. ఎవరు ఆ హీరోయిన్ ఎవరు అంటే.. హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాగా.. హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్దే. టాలీవుడ్ లో తన ఎనర్జ్టిక్ స్టామినాతో అదరగొట్టేస్తున్నాడు రామ్. తన ఫ్యాన్స్ కు అన్ని జోనర్ లలో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు రామ్ ప్రయత్నిస్తుంటాడు. ప్రస్తుతం రామ్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్ నే రిపీట్ చేస్తున్నారా లేదా కొత్త వారితో వెళ్తున్నారా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఇదిలా ఉంటే రామ్ తో బుట్ట బొమ్మ పూజా హెగ్దే రొమాన్స్ చేసే ఛాన్స్ ఇప్పటివరకు రాలేదు. కెరీర్ స్టార్టింగ్ లో యువ హీరోలతో నటించిన పూజా బేబీ ఆ తర్వాత వరుస స్టార్ సినిమాలనే చేస్తూ వచ్చింది. స్టార్స్ తో జత కట్టే టైం లో టైర్ 2 హీరోల గురించి ఆలోచించలేదు అమ్మడు. అయితే ప్రస్తుతం తెలుగులో ఛాన్స్ వస్తే చాలనుకుంటున్న అమ్మడు హీరో ఎవరైనా పర్లేదు అనే పొజిషన్ కి వచ్చేసింది.

ఈ క్రమంలో రామ్ తో పూజా హెగ్దే కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. రామ్ కూడా తన కెరీర్ లో చాలామంది హీరోయిన్స్ తో జత కట్టాడు. ఇలియానా, కాజల్, తమన్నా ఇలా దాదాపు అందరు స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు. కానీ పూజా హెగ్దేతో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. మరి తన నెక్స్ట్ సినిమాల్లో అయినా రామ్ పూజా హెగ్దేని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్. పూజా బేబీ సినిమాలో ఉంది అంటే గ్లామర్ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. సో పూజా హెగ్దే రామ్ ఈ కాంబో వస్తే మాత్రం సినిమా ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుందని చెప్పొచ్చు.

Tags:    
  • Poojahegde 
  • Actress 
  • Filmindustry 
  • Rampotineni 
  • Doubleismart 
  • Purijaganaadh 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS