సక్సెస్ కోసం భామల ఎదురుచూపులు
ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఎవరికైనా సరే ఒక సాలిడ్ హిట్ ఉంటేనే వారికి ఇండస్ట్రీలో లాంగ్ రన్ ఉంటుంది.;
ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఎవరికైనా సరే ఒక సాలిడ్ హిట్ ఉంటేనే వారికి ఇండస్ట్రీలో లాంగ్ రన్ ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌కు. లేదంటే ఎవరైనా కొత్త భామ వస్తే వారి అవకాశాలన్నీ కొత్త వాళ్లకు వెళ్లిపోవడం ఖాయం. అందుకే ఎవరైనా సరే ఇండస్ట్రీలో సక్సెస్ కోసం తెగ పాకులాడుతారు. ఇప్పుడు టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే, హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల పరిస్థితి కూడా అంతే ఉంది.
వీరిద్దరికీ సినిమా ఛాన్సులు బాగానే వస్తున్నప్పటికీ, రీసెంట్ టైమ్స్ లో వారికి చెప్పుకోదగ్గ హిట్ మాత్రం లేదు. అవకాశాలు ఎన్ని వస్తున్నా, వీరిద్దరికీ ఇప్పుడు అర్జెంటు గా ఓ సాలిడ్ హిట్ అనేది అవసరం. రీసెంట్ గా పూజా తమిళంలో ఓ సినిమా చేయగా అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దాంతో పాటూ ఓ భారీ బడ్జెట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది అయినప్పటికీ అవేవీ పూజా కెరీర్ ను ముందుకు తీసుకెళ్లలేదు.
జన నాయగన్‌పైనే పూజా ఫోకస్
అయితే ఇప్పుడందరి ఫోకస్ జన నాయగన్ పైనే ఉంది. విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి. విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి కలెక్షన్లు కూడా భారీగానే వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ను పక్కనపెడితే పూజాకు ఇప్పుడు ఓ మంచి క్యారెక్టర్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పరాశక్తితో హిట్ కొట్టాలని చూస్తున్న శ్రీలీల
పూజాతో పాటూ శ్రీలీల పరిస్థితి కూడా కోలీవుడ్ లో అలానే ఉంది. శ్రీలీల ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా పరాశక్తి అనే తమిళ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. టీజర్, సాంగ్స్ తాలూకా విజువల్స్ లో ఆమె యాక్టింగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమా శ్రీలీలకు నటిగా మరింత పేరుని తీసుకొస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే వీరిద్దరి లైనప్ లో పలు సినిమాలు ఉన్నప్పటికీ, కోలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే వీరికి అర్జెంటుగా ఓ సక్సెస్ అవసరం.