గర్ల్ ఫ్రెండ్ జోష్ ను RR కంటిన్యూ చేస్తారా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.;

Update: 2026-03-05 07:53 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. నటుడిగా మొదలై.. నేషనల్ అవార్డు గెలిచిన దర్శకుడిగా ఎదిగిన ఆయన జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్‌ గా మారింది. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏంటన్న ఆసక్తి ఇండస్ట్రీలో పెరిగింది.

అయితే రాహుల్ తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చింది అందాల రాక్షసి సినిమాతోనే. మొదటి చిత్రంతో తన న్యాచురల్ నటన, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్‌ తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ఆయన దృష్టి మాత్రం ఎప్పటినుంచో దర్శకత్వం వైపే ఉండేది. ఆ విషయాన్ని ఆయనే పలుమార్లు చెప్పారు.

దీంతో చిలసౌ మూవీతో డైరెక్టర్ గా మారారు. చిన్న కథ, సహజమైన పాత్రలు, రియలిస్టిక్ ట్రీట్మెంట్‌ తో వచ్చిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, నేషనల్ అవార్డు కూడా దక్కించుకుని రాహుల్‌ ను దర్శకుడిగా స్పెషల్ రేంజ్ కు తీసుకెళ్లింది. ఒక క్లాస్ లవ్ స్టోరీని ఎంత అందంగా చెప్పొచ్చో ఆయన నిరూపించారు. ఆ తర్వాత మన్మధుడు 2 తీసినా.. అది క్లిక్ అవ్వలేదు.

కానీ ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్‌ ఫ్రెండ్‌ మూవీ అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడం విశేషం. ముఖ్యంగా రాహుల్ రాసుకున్న ఎమోషన్స్, రిలేషన్‌ షిప్ డ్రామా, క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరోయిన్‌ గా నటించిన రష్మిక మందన్న పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ సినిమాతో రాహుల్ దర్శకత్వం మరోసారి ప్రశంసలు అందుకుంది.

అయితే రాహుల్ ఇప్పుడు తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం రెండు కథలను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ది గర్ల్‌ ఫ్రెండ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో దీక్షిత్ తో ఒక సినిమా తీయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రాన్ని నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఆ తర్వాత మరో మూవీ.. యంగ్ హీరో అడవి శేష్ తో చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనకు కథ వినిపించగా.. ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రెండు సినిమాలు కూడా కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ గా రెడీ అవుతాయని సమాచారం. దీంతో గర్ల్‌ ఫ్రెండ్ మూవీ విజయంతో వచ్చిన ఊపును.. జోష్ ను రాహుల్ కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి యాక్టర్ గా మొదలై, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గా ఎదిగిన రాహుల్ అప్ కమింగ్ చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News