ఉస్తాద్ కొత్త రిలీజ్ డేట్..నిర్మాతలకు కాసుల వర్షం!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సొంతం చేసుకున్నారు.;

Update: 2026-03-05 07:55 GMT

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా వైడ్ గుర్తింపు సొంతం చేసుకున్నారు. తన మేనరిజంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం 10 సంవత్సరాల రాజకీయ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టి.. ఇటు నాయకుడిగా, అటు సినిమా హీరోగా రెండు పడవల మీద ప్రయాణాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు.




 


ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమా చేసి పర్వాలేదనిపించుకున్న ఈయన సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' సినిమా చేసి రికార్డులు క్రియేట్ చేశారు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 26వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ.. వారం ముందే అనగా మార్చి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇక దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వారం ముందే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్మాతలు ఈ రిలీజ్ డేట్ ను మార్చడం వెనుక అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా సినిమాకి మొదటి షో హిట్ టాక్ గనక లభించినట్లయితే.. ఈ చిత్రంనిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఏ హీరో అయినా సరే తమ సినిమాను విడుదల చేసేటప్పుడు కచ్చితంగా హాలిడేస్ ను పరిగణలోకి తీసుకొని మరీ తమ సినిమాను విడుదల చేస్తారు. అయితే ఇక్కడ ఉస్తాద్ కోసం మేకర్స్ తీసుకున్న నిర్ణయానికి ఏకంగా 10 రోజులు కలిసి రావడం ఎవరు ఊహించని పరిణామం.

అసలు విషయంలోకి వెళ్తే.. మార్చి 19వ తేదీన ఈ సినిమా రాబోతోంది.. కాబట్టి మార్చి 18న ఈ సినిమా ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి.. ఇక మార్చి 19వ తేదీ గురువారం ఉగాది పండుగ .. మార్చి 20 శుక్రవారం రంజాన్.. మార్చి 21 శనివారం కాగా , మార్చి 22 ఆదివారం . ఇక మార్చి 27వ తేదీ శ్రీరామనవమి , మార్చి 28 శనివారం, మార్చి 29 ఆదివారం, ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 4 , 5 వీకెండ్స్ కావడం ఇలా మొత్తం పది రోజులు ఈ సినిమాకి కలిసి రావడం గమనార్హం ఏది ఏమైనా ఒక్క విడుదల తేదీని మార్చడంతో ఇన్ని సెలవు దినాలను ఈ నిర్మాతలు క్యాష్ చేసుకోబోతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా పాజిటివ్ టాక్ వస్తేనే ఈ సెలవు దినాలలో ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా వస్తాయనేది గమనించదగ్గ విషయం.. మరి చూద్దాం భారీ అంచనాల మధ్య వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షో ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో.

Tags:    

Similar News