బుట్టబొమ్మ ఎప్పటికీ తను అదే అంటగా!
ఒక దశలో వరుసగా క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటూ బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ఇప్పుడు నత్తనడక నడుస్తోంది.;
ఒక దశలో వరుసగా క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటూ బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ఇప్పుడు నత్తనడక నడుస్తోంది. ఏది ఒప్పుకున్నా అది ఫ్లాపే అవుతూ చిరాకు పెడుతోంది. రాధేశ్యామ్` నుంచి `రెట్రో` వరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుస కట్టి ప్లాప్, డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంటూ వరుస షాకులిస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్‌తో చేసిన బిగ్ మూవీ సర్కస్, సల్మాన్ ఖాన్‌తో నటించిన `కిసీకీ భాయ్ కిసీకీ జాన్, షాహీద్ కపూర్‌తో కలిసి చేసిన `దేవా` తీవ్ర నిరాశను కలిగించాయి.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో పూజ కెరీర్ ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా బుట్టబొమ్మ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మోడ్రన్ డ్రెస్సుల్లో బార్బీ డాల్‌లా కనిపించే పూజా హెగ్డేకు కాంచీవరం చీరలంటే చాలా ఇష్టమట. అందుకే తాను ఎప్పటికీ కాంచీవరం గాళ్‌నే అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌కు సంప్రదాయమైన కాంచీవరం పట్టు చీరలో ఉన్న ఫొటోలని, ఓ వీడియోని జత చేసి అభిమానులతో పంచుకుంది.
`వన్స్ కాంచీవరం గాళ్ ఆల్వేస్ కాంచీవరం గాళ్`అని తను షేర్ చేసిన ఫోటొలకు క్యాప్షన్ ఇచ్చింది. తను షేర్ చేసిన ఫొటోల్లో గోల్డ్ కోటెడ్ అంచుతో లైట్ పింక్ కలర్ కాంచీవరం సారీలో జిగేల్ రాణిలా మెరిపోతోంది. పొడవాటి ఇయర్ రింగ్స్, చౌకర్, చేతులకు బ్యాంగిల్స్ ధరించి, తన పొడవాటి కురులని ఫ్రీగా వదిలేసి కంప్లీట్ గా పదహారణాల తెలుగమ్మాయిలా దర్శనమిస్తోంది. ప్రస్తుతం పూజ షేర్ చేసిన ఫొటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే పూజా హెగ్డే ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లలో హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిడ్ ధావన్ డైరెక్షన్‌లో వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న `హే జవానీ తో ఇష్క్ హోనా హై`, దళపతి విజయ్‌తో `జన నాయగన్`, రాఘవ లారెన్స్ `కాంచన 4`లో నటిస్తోంది. మళ్లీ ఈ సినిమాతో ట్రాక్‌లోకి రావాలని ప్లాన్ చేసుకుంటోంది. వీటితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న `కూలీ`లో బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోంది.