వాళ్లంద‌రికీ పోటీగా ఆ విల‌న్ మారేనా?

భ‌విష్య‌త్ లో అత‌డి పోటీని త‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ అంటే? అక్ష‌య్ ఖ‌న్నాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. `ఛావా` రిలీజ్ తో అక్ష‌య్ క‌న్నా సౌత్ లో వెలుగులోకి వ‌చ్చాడు.;

Update: 2025-12-19 22:30 GMT

బాలీవుడ్ న‌టులు సంజ‌య్ ద‌త్, బాబి డియెల్ లాంటి న‌టులు సౌత్ మార్కెట్ టార్గెట్ గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా స్టార్ హీరోల చిత్రాల్లో ప్ర‌ధాన విల‌న్ల‌గా మారుతున్నారు. మ‌రో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా `దేవ‌ర‌`తో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చాడు. `ఓజీ`తో ఇమ్రాన్ హ‌ష్మీ కూడా తెలు గులో విల‌న్ గా లాంచ్ అయ్యాడు. ఇంకా మాలీవుడ్ నుంచి ప‌హాద్ పాజిల్, శైన్ టామ్ చాకో, పృధ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నారు. టివినో థామ‌స్ కూడా ఎన్టీఆర్ సినిమాలో విల‌న్ గా న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అత‌డితో పోటీ క‌ష్ట‌మా?

ఇక కోలీవుడ్ నుంచి స‌ముద్ర‌ఖ‌ని లాంటి న‌టులు సౌత్ లో ఎక్కువ‌గా విల‌న్ పాత్ర‌లు..కీల‌క పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నారు. దాదాపు తెలుగు స్టార్ హీరోలు న‌టిస్తోన్న అన్ని చిత్రాల్లోనూ వీళ్లే రిపీట్ అవుతున్నారు. తాజాగా వీళ్ల స్పీడ్ కి బ్రేక్ వేయ‌డానికి బాలీవుడ్ నుంచి మ‌రో న‌టుడు దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. భ‌విష్య‌త్ లో అత‌డి పోటీని త‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ అంటే? అక్ష‌య్ ఖ‌న్నాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. `ఛావా` రిలీజ్ తో అక్ష‌య్ క‌న్నా సౌత్ లో వెలుగులోకి వ‌చ్చాడు. హిందీ సినిమా అయినా? అందులో ఔరంగ‌జేపు పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు.

హీరో నుంచి విల‌న్ గా:

వైవిథ్య‌మైన నట‌న‌తో సౌత్ ఆడియ‌న్స్ కు బాగా క‌నెక్ట్ అయ్యాడు. తాజాగా రిలీజ్ అయిన `ధురంధ‌ర్` తో అత‌డి క్రేజ్ రెట్టింపు అయింది. రెహమాన్ డెకాయత్ పాత్ర‌లో అక్ష‌య్ క‌న్నా స్వాగ్ కి ఫిదా కాని వారుండ‌రు. ఎక్క‌డ చూసినా అత‌డి పాత్ర గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌త్యేకించి తెలుగు ఇండ‌స్ట్రీలో అక్ష‌య్ క‌న్నా? గురించి మాట్లా డుకోవ‌డం ఇదే తొలిసారి. బాలీవుడ్ కి వినోద్ ఖాన్నా వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్ష‌య్ ఖ‌న్నా హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీకి ఒక్క‌సారిగా దూర‌మ‌య్యాడు. దాదాపు మూడేళ్ల కంబ్యాక్ త‌ర్వాత విల‌న్ పాత్ర‌ల్లో అద‌ర‌గొడుతున్నాడు.

మ‌హాకాళీ రిలీజ్ అనంత‌రం:

బాలీవుడ్ లో ఇప్ప‌టికే కొన్ని సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. `మ‌హాకాళీ` సినిమాతో తెలుగులోనూ లాంచ్ అవుతున్నాడు. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని అవ‌కాశాలు అందు కుం టాడు. అత‌డు సౌత్ స‌హా తెలుగులో బిజీ అయితే పైన ప్ర‌స్తావించిన న‌టులుంతా ఖాళీ అవ్వాల్సిందే. అక్ష‌య్ ఖ‌న్నా ఇంకా సీరియ‌స్ గా సౌత్ సిని మాల‌పై దృష్టి పెట్ట‌లేదు. కొత్త ఏడాది `మ‌హాకాళీ` రిలీజ్ అవుతుంది. అనంత‌రం అక్ష‌య్ ఖ‌న్నా టాలీవుడ్ పై మ‌రింత సీరియ‌స్ గా దృష్టి పెట్టే అవ‌కాశం ఉంటుంది.

Tags:    

Similar News