ఇండియన్ స్క్రీన్‌పై నెవ్వర్ బిఫోర్ యాక్షన్ మూవీ
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ `కింగ్` చిత్రీకరణను డిసెంబర్ 20 నుండి తిరిగి ప్రారంభించనున్నారు.;
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ `కింగ్` చిత్రీకరణను డిసెంబర్ 20 నుండి తిరిగి ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు అత్యంత కఠినమైన, ఉత్కంఠభరితమైన షెడ్యూల్ ఇది అని చెబుతున్నారు. ఈసారి ఇంటెన్స్ షూట్ లు ఉంటాయి. సూపర్‌స్టార్ షారూఖ్ చిన్నపాటి విరామం తర్వాత తిరిగి టీమ్ లో చేరుతున్నారు. ఇప్పటికి అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలను ఉత్సాహపరుస్తూ, ఈ బృందం స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, డ్రమటిక్ ఫైట్స్ కోసం తిరిగి రంగ ప్రవేశం చేస్తోంది.
తాజా సమాచారం మేరకు.. తదుపరి షెడ్యూల్‌లో అంతర్జాతీయ స్టంట్ డైరెక్టర్లతో కలిసి విస్తృతమైన యాక్షన్ బ్లాక్‌లు, సాంకేతికంగా సవాళ్లతో కూడిన సన్నివేశాలపై దృష్టి సారిస్తారు. కథానాయకుడి పాత్ర ఫిజికల్ గా కూడా చాలా కఠినంగా కనిపించాల్సి ఉంటుంది. చాలా ఓర్పు తో కసితో షారుఖ్ దీని కోసం తీవ్రంగా సన్నద్ధమవుతున్నారని తెలిసింది. సెట్‌లో షారుఖ్‌తో సుహానా ఖాన్ కూడా చేరుతోంది. సుహానా తన తండ్రితో మొదటిసారిగా స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్న ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల జోడీ కలిసి నటించే సీన్లను ఇప్పుడు తెరకెక్కించనున్నారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ , అభిషేక్ బచ్చన్ తదితరుల పాత్రలు కూడా షూట్ లో ఉన్నాయి.
పఠాన్ తర్వాత మళ్లీ సిద్ధార్థ్ ఆనంద్ తో షారూఖ్ భారీ ప్రయోగం చేస్తున్నాడు. ఇది కమర్షియల్ ఎంటర్ టైనర్ అయినా కానీ, దాని ప్రత్యేకత దానికి ఉంటుంది. షారుఖ్ ఇప్పటివరకు చేసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ చిత్రాలలో కింగ్ ఒకటి. వాస్తవిక పోరాటాన్ని స్టైలైజ్డ్ సినిమాటిక్ భాషతో అందంగా తెరపై చూపిస్తున్నారు. నవంబర్‌లో ఖాన్ 60వ పుట్టినరోజున విడుదలైన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం స్వరూపాన్ని, స్థాయిని నిర్వచించే భారీ యాక్షన్ సన్నివేశాలను సిద్ధార్థ్ తెరకెక్కించబోతున్నారు.
స్టోరీలో కీలక మలుపులు ఎమోషనల్ సైడ్ గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. ఇది ఇండియాలో నెవ్వర్ బిఫోర్ యాక్షన్ చిత్రంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం షారుఖ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సుహానా కూడా నిరంతరం తన తండ్రి వద్ద నట శిక్షణను తీసుకుంటోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే ప్రేక్షకులు స్టన్ అవ్వడం ఖాయమని కూడా చెబుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ నెవ్వర్ బిఫోర్ యాక్షన్ చిత్రాన్ని అందించడానికి ఖాన్ తో కలిసి చాలా ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి అన్ లిమిటెడ్ బడ్జెట్ ని ఖర్చు చేయడానికి కూడా దర్శకుడికి అనుమతి ఉందని కూడా గుసగుస వినిపిస్తోంది.