అఖండ 2తో హల్క్ కు లింక్.. శివాజీ ఏమన్నారంటే?

టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2: తాండవం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;

Update: 2025-12-19 18:36 GMT

టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2: తాండవం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమా.. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు రోజు ప్రీమియర్స్ కూడా పడ్డాయి.

అయితే అఖండ-2 మూవీలో బాలయ్య క్యారెక్టర్ కు, మార్వెల్ కామిక్స్ లోని పవర్ ఫుల్ రోల్ హల్క్ కు సంబంధం ఉందట! ఇప్పుడు టాలీవుడ్ నటుడు శివాజీ పరోక్షంగా అలాగే కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. హోస్ట్ అఖండ మూవీ చూశారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

"అఖండ-2 మూవీని ప్రీమియర్ రూపంలో చూశా. నాకు సినిమా నచ్చింది. మూవీలో కథేంటి.. మ్యాజిక్ ల్యాజిక్ కోసం కాదు.. బాలయ్యను చూసి ఎంజాయ్ చేయడానికి నేను వెళ్తా. ఆయన గద తీసుకుని ఉతికి ఆరేస్తారు.. అది సరదాగా ఉంది.. ఫ్యాన్ రెక్కను పట్టుకుని నిలబడతారు. అవన్నీ పాజిబులే" అని శివాజీ తెలిపారు.

"హల్క్ చాలా పెద్దగా అవుతాడు. అలా ఎవరైనా అవ్వగలరా.. అదంతా మ్యాజిక్. అది కొంతమంది చేస్తేనే ఆడియన్స్ చూస్తారు. అదే నేను చేస్తే నవ్వుతారు. కొంతమందికి అది సెట్ అవుతుంది. ఇప్పుడు పబ్ లో జై బాలయ్య అని పెడుతున్నారు. ప్రస్తుత జెనరేషన్ దాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఒకప్పుడు కామెడీగా చూసినా.. ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తోంది" అని అన్నారు.

అయితే ఇప్పుడు శివాజీ కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. అదే సమయంలో హల్క్ స్టోరీ కోసం ప్రస్తావిస్తున్నారు. నిజానికి హాల్క్ అనే వాడు.. శాస్త్రవేత్త డాక్టర్ బ్రూస్ బ్యానర్. గామా రేడియేషన్‌ పై ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటాడు. ఒక పరీక్ష సమయంలో ఓ చిన్న పిల్లాడు అనుకోకుండా ప్రమాదంలో పడతాడు.

దీంతో ఆ పిల్లాడిని కాపాడే ప్రయత్నంలో బ్రూస్ బ్యానర్ తీవ్రమైన గామా కిరణాలకు గురవుతాడు. ఆ ప్రమాదం తర్వాత అతని శరీరంలో పెద్ద మార్పు జరుగుతుంది. బ్రూస్ బ్యానర్‌ కు ఎక్కువ కోపం, భయం లేదా తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు అతడు శరీరంలో ఛేంజ్ వచ్చి ఆటోమేటిక్‌ గా హల్క్ గా మారిపోతాడు. కొన్ని శక్తులు కూడా వస్తాయి.

ఎంత కోపం పెరిగితే అంత బలం పెరుగుతుంది. గాయాలు వెంటనే మానిపోతాయి. మళ్లీ కోపం తగ్గాక మామూలు మనిషిగా మారుతాడు హల్క్. ఏదేమైనా శివాజీ కామెంట్స్ తో హల్క్ కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో బాలయ్య.. అఖండ 2 సినిమాలో హల్క్ లాంటి వారని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News