మాసీవ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌కు సీక్వెల్ రాబోతోంది!

అయితే ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, దుల్క‌ర్ క‌మిట్ అయిని ప్రాజెక్ట్‌లు పూర్త‌య్యాకే దీన్న తెర‌పైకి తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేశారు.;

Update: 2025-12-19 19:30 GMT

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ, తెలుగు భాష‌ల్లోనూ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న మ‌ల‌యాళ యంగ్ స్ట‌ర్ దుల్క‌ర్ స‌ల్మాన్‌. మ‌ల‌యాళం కంటె తెలుగులోనే ఎక్కువ‌గా పేరు తెచ్చుకున్న దుల్క‌ర్ వ‌రుస‌గా తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నాడు. `మ‌హాన‌టి` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన దుల్క‌ర్ `ల‌క్కీ భాస్క‌ర్‌` మూవీతో మ‌ర్చిపోలేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. 2024 అక్టోబ‌ర్ 31న విడుద‌లైన ఈ మూవీ మాసీవ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయ‌గా ఈ మూవీని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో ఏకంగా వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి దుల్క‌ర్ కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది మెమ‌ర‌బుల్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన తెలుగు చిత్రాల్లో టాప్‌లో ట్రెండింగ్ అయింది. ఇప్పుడు ఈ మూవీకి త్వ‌ర‌లో సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ టైమ్‌లోనే సీక్వెల్ టాక్ వినిపించింది.

అయితే ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, దుల్క‌ర్ క‌మిట్ అయిని ప్రాజెక్ట్‌లు పూర్త‌య్యాకే దీన్న తెర‌పైకి తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి హీరో సూర్య‌తో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్టాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌రో ప‌క్క దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ప‌వ‌న్ సాధినేనితో `ఆకాశంలో ఒక‌తార‌`, అయామ్ గేమ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు త‌న 41వ ప్రాజెక్ట్‌గా `ల‌క్కీ భాస్క‌ర్ 2` చేయ‌బోతున్నాడు.

రీసెంట్‌గా ఈ సీక్వెల్‌కు సంబంధించిన చ‌ర్చ‌ల్లో దుల్క‌ర్‌, వెంకీ అట్లూరి మ‌ధ్య జ‌రిగాయ‌ని, చ‌ర్చ‌లు పాజిటివ్‌గా సాగ‌డంతో స్టోరీని లాక్ చేసి 2026 సెకండ్ హాఫ్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం సూర్య‌తో వెంకీ అట్లూరి ఓ మూవీ చేస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ట‌.

Tags:    

Similar News