మాస్క్ హీరోయిన్లు తస్మాత్ జాగ్రత్త!
ఇటీవలే ఓ సినిమా ప్రచారం కోసం షాపింగ్ మాల్ కు వెళ్లిన నిధి అగర్వాల్ ఎలా బుక్ అయిందో ? తెలిసిందే. నిధి అగర్వాల్ ను లైవ్ లో చూసే సరికి అభిమానులు ఉత్సాహం ఆపుకోలేకపోయారు.;
ఇటీవలే ఓ సినిమా ప్రచారం కోసం షాపింగ్ మాల్ కు వెళ్లిన నిధి అగర్వాల్ ఎలా బుక్ అయిందో ? తెలిసిందే. నిధి అగర్వాల్ ను లైవ్ లో చూసే సరికి అభిమానులు ఉత్సాహం ఆపుకోలేకపోయారు. ఆమెతో సెల్పీలు దిగాలని.. పక్క నుంచుని ఫోటోలు అడగాలని చూపించిన ఉత్సాహం దెబ్బకు నిధి ఒణికిపోయింది. వందలాది మంది మధ్య తోపులాటకు గురైంది. అందులో కొందరు ఆకతాయిలు నిధిని తాకాలని చేసిన ప్రయత్నాలు తెలిసిందే. చుట్టూ బౌన్సర్లు ఉన్నా అదుపు చేయలేని పరిస్థితి. చివరికి ఎలాగూ నానా అవస్తలు పడి కారు ఎక్క గలిగింది.
రిస్క్ తీసుకుంటోన్న హీరోయిన్లు:
లేదంటే? అభిమానుల మధ్య నిధి నలిగిపోయేది అన్నది వాస్తవం. ఈ ఘటన చూసిన తర్వాత ఇంకే హీరోయిన్ కూడా షాపింగ్ మాల్లో సినిమా ప్రచారానికి వెళ్లాలనుకోదు. ఒకవేళ వెళ్లానుకుంటే భారీ భద్రత ఉంటే? తప్ప అంత రిస్క్ తీసుకోకూడదని కచ్చితంగా అనుకుంటారు. అప్పుడప్పుడు అభిమానులతో ఇలాంటి ఇక్కట్లు సహజమే అనుకున్నా? అది కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. నిధి అగర్వాల్ విషయంలో మొన్న జరిగింది అలాంటిదే. ఇదంతా అనుకోకుండా జరిగిన సంఘట అనుకోండి. అయితే కొంత మంది హీరోయిన్లు? కొత్త సినిమాల రిలీజ్ సమయంలో మల్టీప్లెక్స్ లకు సింగిల్ గా వెళ్లి వస్తుంటారు.
తేడా జరిగితే భారీ మూల్యమే:
ఆ సమయంలో అభిమానులు..చుట్టూ ఉన్న జనం గుర్తు పట్టకుండా స్కాప్ లు..మాస్క్ లు ధరిస్తుంటారు. సాధారణ అమ్మాయిలా ఆన్ లైన్ లో నో? బుకింగ్ కౌంటర్ వద్దనే టికెట్ కొనుక్కుని థియేటర్లోకి వెళ్లి కూర్చుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సినిమా చూసి ఇంటికెళ్తే పర్వాలేదు. కానీ ఈ ప్రోసస్ లో ఎక్కడ తేడా జరిగినా? భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనడానకి నిధి కి జరిగిన సంఘటన ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.
బీ అలెర్ట్ భామలు:
థియటర్లో ఉన్నప్పుడు స్కాప్ తొలగిపోయిన్నా? థియేటర్ నుంచి బయటకు వచ్చిన సమయంలో పోరపాటున ముసుగు తొలగించినా? గాలికి ఎగిరి ఊడిపోయినా? చుట్టూ ఉన్న జనానికి ఆమె హీరోయిన్ అని తెలిస్తే చాలు క్షణాల్లో అక్కడ సన్నివేశం మారిపోతుంది. ఆ సమయంలో బాడీ గార్స్డ్ గానీ, ఎలాంటి ఇతర భద్ర తా సిబ్బంది కూడా అందుబాటులో ఉండరు కాబట్టి! ఎలాంటి పరిస్థితుకైనా అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి సీక్రెట్ గా థియేటర్లకు వెళ్లే హీరోయిన్లు అంతా మరింత అప్రమత్తగా ఉండటం మంచింది.